వంటా వార్పు: `ఎగ్‌ మసాలా కర్రీ`.. ఇలా చేసుకుంటే నోరూరాల్సిందే..!!

Kavya Nekkanti

ఎగ్స్‌- నాలుగు
ఉల్లిపాయ త‌రుగు- ఒక క‌ప్పు
అల్లం, వెల్లుల్లి పేస్ట్- ఒక టేబుల్‌ స్పూన్‌
పసుపు- పావు టీ స్పూన్‌

 

టమాటా త‌రుగు- ఒక క‌ప్పు
పచ్చిమిర్చి- నాలుగు
గరం మసాలా- అర టీ స్పూన్‌

 

కారం- అర టేబుల్ స్పూన్‌
ధనియాల పొడి- అర టీ స్పూన్‌
కొత్తిమీర త‌రుగు- ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం: ముందుగా గుడ్లు ఉడికించి ఫోర్క్ తో హోల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె వేసి వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించాలి. అవి వేగాక టమాటా ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు వేయాలి. 

 

నూనె వేరు పడే వరకూ ఉడికిన తర్వాత గరం మాసాల, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరిగా గుడ్లు కలిపి మూత పెట్టి పావు గంట ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుంటే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయినట్లే. రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. ఇక గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అపరిమిత పోషకాలు గల ఆహారం ఇది. 

 

అందుకే ఏ ఒక్క వయసుకో పరిమితం కాకుండా పిల్లల నుంచి అన్నీ వయసుల వారు గుడ్డు తినవచ్చు. గుడ్డులో కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఇలా చాలా ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్‌ గుణాలు కూడా ఉంటాయి. అందుకే రోజుకు క‌నీసం ఒక గుడ్డు అయినా తింటే మంచిద‌ని నిపుణులు అంటున్నారు. పోని.. విడిగా తిన‌లేని వారు పైన చెప్పిన విధంగా ఎగ్‌ మసాలా కర్రీ చేసుకంటే చాలా ఇష్టంగా తింటారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: