వంటా వార్పు: రుచికరమైన.. ఆరోగ్యకరమైన `అటుకుల లడ్డూ`
కావాల్సిన పదార్థాలు:
అటుకులు- రెండు కప్పుల
ఎండు కొబ్బరి తురుము- రెండు స్పూన్లు
యాలక్కాయలు- నాలుగు
నెయ్యి- పావు కప్పు
బాదం పప్పు- పది
పంచదార- ఒక అరకప్పు
జీడి పప్పు- కొద్దిగా
పిస్తా పప్పులు- కొద్దిగా
తయారీ విధానం: ముందుగా ఒక పాన్‌లో ముందుగా అటుకులు పోసి సన్నని సెగమీద దోరగా వేయించుకొని పక్కనబెట్టుకోవాలి. ఇప్పడు అదే పాన్ కాస్త నెయ్యి వేసి బాదం పప్పు, జీడి పప్పు, పిస్తా పప్పు ఒక దాని తర్వాత ఒకటి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అటుకులు ఆరిన తర్వాత అందులో నెయ్యి తప్ప మిగిలిన పదార్థాలు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరగా నెయ్యి కలుపుకొని మరో మారు మిక్సీ పట్టి మిశ్రమాన్ని వెంటనే లడ్డూ కట్టుకోవాలి. అంతే ఎంతో సులువైన, ఆరోగ్యకరమైన అటుకుల లడ్డూ రెడీ. సో.. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.