వంటా వార్పు: `వంకాయ ఆవ‌కాయ‌` ఇలా చేస్తే నోరూరాల్సిందే..!

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
వంకాయలు- పావుకిలో
పసుపు - అర టీ స్పూను
నూనె- త‌గినంత‌

 

కారం - 150 గ్రాములు
మెంతిపిండి - ఒక టీ స్పూను
ఆవపిండి- 150 గ్రాములు

 

ఇంగువ - కొద్దిగా
ఉప్పు - 150 గ్రాములు
చింతపండు - 50 గ్రాములు

 

తయారీ విధానం: ముందుగా వంకాయల్ని నీటిలో శుభ్రం చేసి, త‌డి ఆర‌బెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో ముక్కలు క‌ట్ చేసుకోవాలి. త‌ర్వాత స్టౌ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనెపోసి కాగాక క‌ట్ చేసి పెట్టుకున్న వంకాయ‌ ముక్కల్ని వేసి కొద్దిగా మగ్గనిచ్చి దించుకోవాలి. అలాగే మ‌రోవైపు చింతపండుని ఉడికించి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు మరో పాన్‌లో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి కాగాక ఇంగువ వేసి దింపేయాలి. 

 

త‌ర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్ప, మెంతిపిండి, పసుపు వేసి బాగా కలపుకుని చింతపండు గుజ్జు, వంకాయ ముక్కలు, కాచిన నూనె వేసి కలుపుకోవాలి. దీన్ని గాజుసీసాలో పెట్టాలి. మిగిలిన నూనెని పచ్చడిపై పోసుకోవాలి. అంతే.. వంకాయ ఆవకాయ రెడీ. రెండు, మూడు రోజుల పాటు ఊర‌నిచ్చి తీసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: