ఎంతో సులువుగా ` ఎగ్ ఖీమా ` చేసుకోండిలా..

Kavya Nekkanti
కావాల్సిన ప‌దార్ధాలు:
ఉడికించిన గుడ్ల తురుము - 2 కప్పులు
టమోటా గుజ్జు - అరకప్పు
పచ్చిబఠాణి - అరకప్పు
నూనె - 2 టేబుల్‌ స్పూన్లు
బిర్యాని ఆకు - 1


యాలకులు - 3
లవంగాలు - 2
ఉల్లిపాయ - 1
స్పూను చొప్పున
ఉప్పు - రుచికి తగినంత


కారం, దనియా, జీరా పొడులు - 1 టీ స్పూను
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు - 1
గరం మసాల - అర టీ స్పూను
కొత్తిమీర తరుగు - అరకప్పు
నీరు - అరకప్పు


తయారీ విధానం:
ముందుగా నూనెలో బిర్యాని ఆకు, యాలకులు, లవంగాలు వేగించాలి. తర్వాత ఉల్లి తరుగు, చిటికెడు ఉప్పు వేసి మూతపెట్టి చిన్నమంటపై ఐదు నిమిషాలు ఉంచాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమోటా తరుగు ఒకటి తర్వాత ఒకటి వేగించి మూతపెట్టాలి.


టమోటాలు మెత్తబడ్డాక కారం, పసుపు, దనియా, జీరా పొడులు కలపాలి. తర్వాత గుడ్ల తురుము(పచ్చసొన లేకుండా)తో పాటు ఉప్పు, ఉడికించుకున్న పచ్చిబఠాణీ కలిపి రెండు నిమిషాల తర్వాత గరం మసాలా, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే ఎంతో సులువుగా ఎగ్ ఖీమా రెడీ..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: