"నకరాలు చేస్తే తోలు తీస్తా..?"..యంగ్ హీరోయిన్ పై ప్రశాంత్ వర్మ గుస్సా..ఎందుకంటే..!?
ఈ ఏడాది సంక్రాంతికి ఆయన తెరకెక్కించిన సినిమా 'హనుమాన్' రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. హనుమాన్ కి పోటీగా వచ్చిన 'గుంటూరు కారం' సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ సంపాదించుకొని సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైంది . అయితే ప్రెసెంట్ ప్రశాంత్ వర్మ చేతిలో బోలెడన్ని సినిమాలో ఉన్నాయి . మరి ముఖ్యంగా 'మోక్షజ్ఞ' డెబ్యు మూవీని కూడా బాలయ్య ప్రశాంత్ వర్మ చేతిలోనే పెట్టేసాడు. దీంతో ప్రశాంత వర్మ పేరు మారుమ్రోగిపోతుంది. అయితే ఇదే మూమెంట్లో ఓ హీరోయిన్ తో ప్రశాంత్ వర్మ కు మనస్పర్ధలు వచ్చాయి విభేదాలు ఉన్నాయి అన్న వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి . ఆ హీరోయిన్ మరెవరో కాదు "అమృత అయ్యార్".
హనుమాన్ సినిమాలో హీరోయిన్గా నటించిన బ్యూటీ . ఈ హీరోయిన్ గురించి మనందరికీ తెలిసిందే . తమిళ్లో కొన్ని సినిమాల్లో నటించింది . అంతగా గుర్తింపు తీసుకురాలేదు . తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది పెద్దగా పాపులారిటీ దక్కించుకోలేదు . హనుమాన్ సినిమా ద్వారానే ఆమె మంచి విజయం అందుకుంది . తన పేరు నలుగురికి తెలిసేలా చేసింది . అయితే తాజాగా ఆమె నటించిన సినిమా ప్రమోషన్స్ లో ఆమె ప్రవర్తించిన తీరు అందరికీ హాట్ టాపిక్ గా అనిపించింది.
హనుమాన్ గురించి మాట్లాడేందుకు అసలు ఇష్టపడలేదు. అంతేకాదు గతంలో హనుమాన్ మూవీ ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేదు. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఏవో విభేదాలు ఉన్నాయి అన్న విషయం బయటపడింది . అయితే "బచ్చలమల్లి".. ప్రమోషన్స్ లో కూడా హనుమాన్ మూవీ గురించి మాట్లాడడానికి ఇష్టపడకపోవడంతో కొంతమంది ప్రశాంత్ వర్మ ఫ్యాన్స్ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . నీకు లైఫ్ ఇచ్చింది ప్రశాంత్ వర్మ ..మరి ఎందుకు నీకు ఆయనతో విభేదాలు..? ఏదైనా ఉంటే సార్ట్ అవుట్ చేసుకోవాలి. మరి కొందరు మాత్రం కూసింత హద్దులు మీరూతూ నకరాల చేస్తే తాటతీస్తాం బిడ్డ.. మంచిగా ఉంటే మంచిగా.. చెడుకొస్తే చెడుగా ..జాగ్రత్త ..ప్రశాంత్ వర్మపై ఎటువంటి నెగిటివ్ కామెంట్ చేసిన అస్సలు ఊరుకోమంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ప్రశాంత్ వర్మ అమృతా ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి..!