చిన్న సినిమాగా వచ్చి హిట్ కొట్టిన తమిళ్ మూవీస్..!
బ్లడీ బెగ్గర్: డార్క్ హ్యూమర్ జోనర్ లో తెరకెక్కిన బ్లడీ బెగ్గర్ మూవీ థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచినప్పటికీ ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన సమయంలో ఓటిటి ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకుంది. అలా థియేటర్లో ఫ్లాఫై ఓటిటి ప్లాట్ఫారంలో మాత్రం హిట్ అయింది.
లబ్బర్ పందు: తమిళ రసన్ పచ్చ ముత్తు దర్శకత్వంలో వచ్చిన లబ్బర్ పందు సినిమాలో ఓ ఇద్దరు మనసుల మధ్య ఈగో అనేది ఎలా విడదీస్తుంది అనే విషయాన్ని చూపించారు. ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో కూడా ఓటిటి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
లవర్: అబ్బాయిలు భార్య లేదా లవర్ లను హక్కుగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ గ్లోరిఫికేషన్ వెనుక ఉన్న శాడిజం ఎలా ఉంటుంది అనేది లవర్ మూవీలో చూపించారు.ఈ సినిమా తెలుగులో ట్రూ లవర్ గా రీమేక్ అయింది.
మహారాజా: ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అనురాగ్ కశ్యప్ ఈ సినిమాకి ప్రత్యేకమైన నటుడు. డైరెక్టర్ నితిలన్ అద్భుతంగా తెరకెక్కించారు.
డిమాంటే కాలనీ 2:
హర్రర్ ఎపిసోడ్ త్రిల్లింగ్ సినిమాలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏడాది ఇచ్చిన చిత్రంగా నిలిచింది. డైరెక్టర్ అజయ్ జ్ఞాన ముత్తు చిత్రాన్ని తెరకెక్కించారు.
తంగాలాన్: పా రంజిత్ డైరెక్షన్లో విక్రమ్ నటించిన ఈ సినిమా విక్రమ్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇవే కాకుండా మెయిళగన్, అమరన్, గరుడన్, హాట్ స్పాట్, బ్లూ స్టార్ తదితర చిత్రాలు ఉన్నవి.