కావాల్సిన పదార్థాలు:
క్యారెట్ జ్యూస్-3 కప్పులు
చెక్కెర-2 కప్పులు
పాలు-2 కప్పులు
క్రీమ్-1 కప్పు
కార్న్ ఫ్లోర్- 1 టీ స్పూన్
పిస్తా పప్పు-2 టేబుల్ స్పూన్లు
బాదం పప్పు- 2 టేబుల్ స్పూన్లు
తయారుచేసే విధానం:
ముందుగా ఒక మందపాటి పాత్రలో పాలు చెక్కెర వేసి స్టౌపై పెట్టాలి. కొద్దిగా పాలలో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా చేసుకొని తిరిగి పాలలో వేసి బాగా కలపాలి. పాలు చిక్కగా అయ్యాక క్రీమ్ వేసి కలపాలి. పాలు మరిగిన తర్వాత క్యారెట్ జ్యూస్ వేసుకోవాలి. మిశ్రమం మరింత చిక్కగా అయ్యే వరకు ఉడికించి దించేసుకోవాలి.
ఆ తర్వాత చల్లారాక డీప్ ఫ్రిజర్‌లో పెట్టాలి. కొంత సమయం తర్వాత తీసి మిక్సీలో బాగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లో తీసుకొని బాదం, పిస్తాలతో గార్నిష్ చేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఐస్ అయిన తర్వాత బయటకు తీసి సర్వింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఎంతో సులువుగా క్యారెట్ ఐస్ క్రీమ్ రెడీ..