కర్మ ఫలితం అంటే ఇదే.. అనుకున్నట్లుగానే చోరీ చేశాడు.. కానీ?

praveen
సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడు ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఇలా ఇంటర్నెట్లో ప్రత్యక్షమైన వీడియోలు భయాందోళనకు గురి చేస్తే మరికొన్నిసార్లు కడుపుబ్బ నవ్వును తెప్పిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది దొంగలు చాకచక్యంగా చోరీలకు పాల్పడుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే చాలామంది దొంగలు ఎంతో చాకచోక్యంగా చోరీలకు పాల్పడి ఇక ఎవరికీ దొరకకుండా పారిపోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం చోరీ అయితే సక్సెస్ఫుల్ గా చేస్తారు కానీ ఇక తర్వాత ఎలా తప్పించుకోవాలో తెలియక చివరికి దొరికిపోవడం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక దొంగ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఎంతో దర్జాగా యాపిల్ స్టోర్ లోకి వెళ్లిన ఒక వ్యక్తి అక్కడ చోరీ చేశాడు. ఈ క్రమంలోనే తప్పించుకోవాలని అనుకున్నాడు. కానీ చివరికి అతని ప్లాన్ కాస్త రివర్స్ అయ్యింది. దీంతో తప్పించుకోవడం మాట దేవుడెరుగు ఏకంగా అతను ఆసుపత్రి బెడ్ పైకి చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక వ్యక్తి యాపిల్ స్టోర్ నుంచి ఏదో దొంగలించి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే దొంగ చోరీ కోసం రాగా అతని స్థానికులు గమనించారు. దీంతో తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఏకంగా రెండో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు దొంగ. అతను ఏం హీరో కాదు కదా సామాన్యుడు. దీంతో రెండో ఫ్లోర్ నుంచి కింద పడగానే అతని కాలు విరిగిపోయింది. కనీసం లేచి నిలబడటం కూడా అతను వళ్ళ కాలేదు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చేతులు కాళ్ళకి కనిపించని దెబ్బలు బాగానే తగిలినట్లు అర్థమవుతుంది. దీంతో లేచి పరిగెత్త లేకపోయాడు. ఇక అతని పట్టుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని ముందుగా ఆసుపత్రిలో చేర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: