నగ్నపూజల కలకలం.. శభాష్‌ దిశ యాప్‌?

Chakravarthi Kalyan
అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగ గలిగినాడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది అన్నట్లుగా పెద్దలు చెప్పారు అయితే నిజానికి బయట జరుగుతున్నది మాత్రం దీనికి విరుద్ధంగా కనిపిస్తుంటుంది. అర్ధరాత్రి కాదు కదా పట్ట పగలు కూడా ఆడవాళ్ళకి రక్షణ కరువు అవుతున్న సంఘటనలు చాలా జరుగుతున్నాయి మన చుట్టూ. దేశంలోని పలుచోట్ల పట్టపగలే ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతున్న విషయం తెలిసిందే.

చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆడ అనే పదం వినిపిస్తే చాలు అత్యాచారాలు జరిగిపోతున్నాయి. అయితే ఆడవారికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మొదలైంది దిశా యాప్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఆడవారి రక్షణ కోసం తయారుచేసిన యాప్. ఇది ఎందరో మహిళల అభిమానాన్ని చూరగొంటుంది. వారికి రక్షణ కల్పిస్తుంది. తాజాగా దిశ యాప్ 112 నెంబర్ ద్వారా మరో ఇద్దరు అమ్మాయిలు రక్షించబడ్డారు అన్నట్లుగా తెలుస్తుంది.  

క్షుద్ర పూజలు చేసే ఒక వ్యక్తి గుంటూరులోని ఒక బ్యూటిషన్ ద్వారా ఈ అన్యాయం చేయబోయాడని తెలుస్తుంది. నాగేశ్వరావు అనే ఒక వ్యక్తి చిలకలూరిపేటలోని ఒక బ్యూటీ పార్లర్ నడిపే అరవింద అనే నిర్వహకురాలకి ఏవో శక్తులు ప్రసాదిస్తానని చెప్పాడట. దాని కోసం ఇద్దరు యువతులు  నగ్నంగా యాగంలో కూర్చోబెట్టాలని చెప్పాడట. దానికోసం గుంటూరు జిల్లాకు సంబంధించిన 19, 20 ఏళ్ల వయసున్న ఇద్దరు అమ్మాయిలను ఆవిడ కాంట్రాక్ట్ మాట్లాడి తీసుకొచ్చిందట.

ఆ తర్వాత తాడికొండ దగ్గర రెండు రోజులు నగ్నంగా కూర్చోబెట్టాడట ఆ వ్యక్తి. అయితే ఆ తర్వాత ఫలితం ఏమి కనపడకపోవడంతో ప్రశ్నించిన ఆవిడకి మరో రెండు రోజులు కూర్చోబెట్టాలని అన్నాడట. దాంతో మళ్లీ కూర్చోవడానికి ఈ అమ్మాయిలు ఒప్పుకోలేదట. ఇప్పటికే నాలుగు రోజుల కూర్చున్నాం, మాకు ఇస్తానన్న పేమెంట్ కూడా ఇవ్వలేదు అని నిరాకరించారట. దాంతో నిర్వహకురాలు బలవంతంగా తీసుకు వెళ్తుంటే వాళ్లు112 కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని తెలుస్తుంది. సమాచారం అందడంతో దిశ పోలీసులు వచ్చి వాళ్ళని కాపాడారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: