సాక్ష్యం మూవీ సేమ్ రిపీట్.. ఎద్దుపై యువకుడు స్వారీ.. చివరికి?

praveen
కొన్ని కొన్ని సినిమాల్లో హీరోలు చేసే విన్యాసాలు నిజజీవితంలో సామాన్య ప్రేక్షకులు చేయడం మాత్రం దాదాపు అసాధ్యమని అందరికీ అర్థమవుతూ  ఉంటుంది. ఎందుకంటే సినిమాల్లో అయితే హీరోలు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని విన్యాసాలు చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటివి రియల్ లైఫ్ లో అసాధ్యమని చెప్పాలి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సాక్ష్యం సినిమాలో అతను చివర్లో ఏకంగా ఎద్దు పై స్వారీ చేస్తూ ఉంటాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. గ్రాఫిక్స్ కాబట్టి ఇది ఎలాగో మేనేజ్ చేయగలిగారు. కానీ నిజ జీవితంలో ఎద్దు పై స్వారీ చేయడం అంటే అది ఊహించడానికే భయంకరంగా ఉంటుంది.

 కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాక్ష్యం సినిమా చూసి బాగా స్ఫూర్తి పొందాడో లేకపోతే మద్యం మత్తులో తనను తాను హీరో అనుకున్నాడో తెలియదు. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం ఏకంగా ఎద్దుపై స్వారీ చేయడం కాస్త సంచలనంగా మారిపోయింది. ఉత్తరాఖండ్లోని రిషికేశ్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.  అయితే ఆ యువకుడు ఎద్దు పై స్వారీ చేసిన వీడియోని ఉత్తరాఖండ్ పోలీసులు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం గమనార్హం. మధ్యమధ్యలో ఉన్న సదరు యువకుడు సోషల్ మీడియాలో పాపులారిటీ సాధించాలని ఉద్దేశంతో చేసిన ఈ పని చివరికి అతన్ని జైలు పాలు చేసింది.


 అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చివరికి కటకటాల వెనక్కి తోసారూ.  అయితే అర్థరాత్రి సమయంలో వీధుల్లో ఎద్దు పై స్వారీ చేస్తూ అతడు చేస్తున్న విన్యాసాలు చూసి స్థానికులు అందరూ కూడా బెంబలెత్తిపోయారు. ఎద్దు తమ వైపుకు దూసుకు వస్తుంటే ప్రాణ భయంతో పరుగులు తీశారు. అయితే ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు. అరెరే ఇది మా బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం మూవీ సీన్ లాగే ఉంది అని తెలుగు వారు ఇక సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: