పుష్ప సినిమాను మించిన స్మగ్లింగ్.. క్యాబేజీ బస్తాల్లో?

praveen
ఇటీవల కాలంలో జనాలపై సినిమాల ప్రభావం ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినిమాలకు వెళ్తున్న జనాలు అందులో ఉన్న మంచిని వదిలేసి కేవలం చెడుకు మాత్రమే ఆకర్షితులు అవుతున్నారు. ఈ క్రమంలోనే సినిమాల్లో హీరోలు చేసినట్లుగానే నిజ జీవితంలో కూడా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఇటీవల కాలంలో కోకోళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 అయితే ఈ సినిమాలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే పుష్పరాజు పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తాడు. అయితే పోలీసులకు దొరకకుండా తెలివితేటలు ఉపయోగించి పుష్పరాజ్ గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేయడం ఈ సినిమాలో చూపిస్తూ ఉంటారు. అయితే ఇక ఈ సినిమాలో చూపించిన దానికి తెగ ప్రభావితం అయిపోయారు ఎంతోమంది అక్రమార్కులు. అప్పటికే ఏదోక విధంగా పోలీసులకు కంటపడకుండా గంజాయి, డ్రగ్స్ లాంటివి అక్రమంగా తరలించేవారు. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లాగానే కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు.

 కానీ పోలీసులు కూడా పుష్ప సినిమా చూసే ఉంటారు కదా. అందుకే వాళ్ళు కూడా మరింత సరికొత్తగా ఆలోచించి అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇటీవల పుష్ప సినిమాను తలపించే విధంగా కొందరు కేటుగాళ్లు గంజాయి అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించారు. క్యాబేజీ బుట్టల మాటున గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు. ఒడిస్సా నుండి క్యాబేజీ బస్తాల లోడుతో వాహనం వెళ్తుండగా.. విశాఖ సమీపంలో పెందుర్తిలో పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. 
అయితే స్మగ్లింగ్ చేయడానికి అక్రమార్కులు ఎంచుకున్న దారి చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. అయితే ఇలా పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్ చేసిన ఘటనలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: