నదిలో స్నానం చేస్తుండగా మెరుపులు.. ఏంటా అని చూస్తే?

praveen
ఇప్పటికీ అనేక గ్రామాల్లో ప్రజలు తమ పశువులకి దగ్గరలో ఏదైనా కాలువ లేదా నది ఉంటే అందులో పశువులకు స్నానం చేయించడం, అక్కడే వారు కూడా స్నానం చేయడం వంటివి చేస్తూనే ఉంటారు. పశ్చిమ బెంగాల్లోని బీర్ భూమ్ అనే జిల్లాలో పడకండి అని ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో కొంతమంది వ్యక్తులు వారి దగ్గరలో ఉన్న ఒక నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. అక్కడ స్నానం చేస్తున్న సమయంలో వారికి ఒక వింతైన మెరుపు రావడం గమనించారు. ఆ మెరుపులు ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించగా వారు ఒకింత షాక్ కి గురయ్యారు. ఆ నదిలో వారికి బంగారం రంగులో మెరిసిపోతూ కొన్ని నాణాలు కనిపించాయి. అలా నదిలో మొత్తం గాలిస్తూ ఉండగా చాలా నాణాలు బయటపడ్డాయి. వారికి అదంతా చూడగా బంగారం లాగానే కనిపించింది.

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సదరు గ్రామస్తులు పరిగెత్తుకుంటూ గ్రామంలోకి వెళ్లారు. అక్కడికి వెళ్లి మిగిలిన మిగతా గ్రామ సభ్యులకి విషయాన్ని చెప్పారు. నదిలో బంగారం ఉంది, మెరిసిపోతూ కనిపిస్తుంది అంటూ అరుపులు కేకలు వేశారు. వారితో పాటు కొన్ని నాణాలను వెంట తీసుకెళ్లి వారికి చూపించారు. అందరూ ఆ నాణాలను చూసి షాక్ కి గురవడమే కాదు ఊరంతా సదరు నది వద్దకు వెళ్లి చూశారు. వారికి కూడా ఆ నాణాలు బంగారం రంగులో మెరుస్తూ కనిపించాయి. నదంతా కూడా ఆ గ్రామస్తులు జల్లెడ పట్టారు. ఆ చుట్టుపక్కల ఉన్న ఇసుక తెప్పల్లో నాణాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు.

ఇది వరకే జార్ఖండ్ కి చెందిన ఒక వ్యక్తికి ఆ నది ఒడ్డున కొన్ని బంగారు నగలు దొరికాయి అనే విషయం కూడా అక్కడ పుకారులో ఉంది. ఆ ఆభరణాలు దొరికిన ప్రాంతానికి వీరి గ్రామం చాలా దగ్గరలో ఉండడంతో గ్రామస్తులు ఇవి కూడా ఆభరణాలకు సంబంధించినవి అంటూ పుకారు మొదలుపెట్టారు.
 అక్కడికి అతి దగ్గరలో ఒక ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ పెరు  రాజ్ బరీ ప్యాలెస్. నృపేంద్ర నారాయణ్ అనే మహారాజు అందులో ఉండేవాడు. ఈ ప్యాలస్ ని లండన్ కి చెందిన బకింగ్ హమ్ ప్యాలెస్ కి స్ఫూర్తిగా తీసుకొని నిర్మించారు.ఈ నాణాలు మరియు ఆభరణాలను ఈ నది మీదుగా సదరు రాజు గారు తీసుకెళ్తున్న సమయంలో కొట్టుకు వచ్చినవి అని అనుకుంటున్నారు. ఇంతకుముందు కూడా అదే నదిలో ఒకసారి బంగారు హారం దొరికినట్టుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అధికారులు అక్కడికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకునే పనిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: