మద్యం మత్తులో పెళ్ళి ముహూర్తం మరిచిపోయాడు.. చివరికి?

praveen
ప్రతి ఒకరి జీవితంలో వివాహం అనేది ఒక ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే కొత్త వ్యక్తిని తమ జీవితంలోకి ఆహ్వానించి ఇక సరికొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే యువతి యువకులు ఇద్దరు కూడా పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక నేటి రోజుల్లో పెళ్లిళ్లు ఒకప్పటి సాంప్రదాయాలను కొనసాగిస్తూనే ఆధునికతను జోడించి జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

 ఇటీవల కాలంలో పెళ్లిళ్లలో వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఏకంగా వరుడు ఫుల్లుగా మద్యం తాగి కనీసం ఒకచోట కూర్చోలేని స్థితిలో పెళ్లి మండపం పైకి వచ్చాడు. పక్కనే ఉన్న స్నేహితులపై తలవాల్సి నిద్రపోయాడు. ఇది గమనించిన వధువు ఇలాంటి తాగుబోతు వరుడు నాకు వద్దే వద్దు అంటూ చివరికి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఘటన అందరిని అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక యువకుడు మధ్యమధ్యలో చేసిన పని మాత్రం అందరిని ముక్కున వేలేసుకునేలా చేసింది.

 ఏకంగా మధ్యమధ్యలో పెళ్లి ముహూర్తాన్నే మరిచిపోయాడు పెళ్ళికొడుకు. ఇక మరునాడు మండపానికి వెళ్తే ఊహించిన ట్విస్ట్ చోటుచేసుకుంది. బీహార్ లోని భాగల్పూర్ ప్రాంతానికి చెందిన మియాన్ అనే యువకుడికి సుల్తాన్ గంజ్ గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. మార్చ్ 14వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఇక బంధుమిత్రులు అతిథులతో కల్యాణ మండపం నిండిపోయింది. అందరూ వరుడు కోసం నిరీక్షించడం మొదలుపెట్టారు. అయితే ముహూర్తం దాటిన వరుడు జాడ మాత్రం లేదు. ఫోన్ చేసినా వరుడు వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. చివరికి ముహూర్తం దాటిపోయిన తర్వాత మర్నాడు మధ్యాహ్నం సమయంలో వరుడు ఫుల్లుగా మద్యం సేవించి పెళ్లి మండపానికి వచ్చాడు. ఇది గమనించిన వధువు పెళ్లి రద్దు చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతేకాదు ఇక వరుడుని అతనితో వచ్చిన స్నేహితులను కూడా పట్టుకుని పెళ్లి కోసం చేసిన ఖర్చు మాత్రం తిరిగి ఇవ్వాలంటూ వధువు కుటుంబ సభ్యులు డిమాండ్ చేయగా.. ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: