పెళ్లిరోజు వధువు మృతి.. అయినా పెళ్లి జరిగింది.. ఎలా అంటే?

praveen
ఇటీవల కాలంలో మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా చెప్పలేని విధంగా మారిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక ఇంటర్నెట్లో వెలుగులోకి వస్తున్న కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఎంతో మందికి ప్రాణాలపై మరింత తీపి పెరిగిపోతోంది అని చెప్పాలి. ఎందుకంటే అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కేవలం సెకండ్స్ కాలంలో ఎంతోమంది గుండెపోటుకు గురై మరణిస్తూ ఉన్నారు. సామాన్యులు మాత్రమే కాదు.. ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రిటీలు సైతం ఇక ఇలా మరణిస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 మనిషి జీవితం ఇంతేనా అని ప్రతి ఒక్కరికి ఇక ఈ వీడియోలను చూసిన తర్వాత అనిపిస్తూ ఉంది. అప్పటివరకు ఎంతో సరదాగా సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపిన వారు చూస్తూ చూస్తుండగానే గుండెపోటు కారణంగా కుప్పకూలిపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో కోకోళ్ళలుగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఒక మంచి అబ్బాయిని చూసి తల్లిదండ్రులు కూడా పెళ్లి నిశ్చయించారు.

 అయితే ఇక పెళ్లికి అంత సిద్ధమైంది ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో పెళ్లి జరుగుతుంది అనుకుంటున్న సమయంలో వధువును గుండెపోటు రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది. బావ్ నగర్ జిల్లా సుభాష్ నగర్ లో కొన్ని గంటలు పెళ్లి జరగాల్సి ఉండగా గుండెపోటుతో వధువు హేతల్ చనిపోయింది. అయితే అదే సమయంలో వరుడు, అతని కుటుంబ సభ్యులు ఊరేగింపుతో పెళ్లి మండపానికి వచ్చారు. ఈ క్రమంలోనే పుట్టెడు దుఃఖాన్ని దిగమింగే చనిపోయిన కుమార్తె స్థానంలో ఆమె చెల్లెను ఇచ్చి వధువు పేరెంట్స్ వివాహం జరిపించడం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: