కాలేజీ బస్సులో క్షుద్ర పూజలు.. ఎక్కడంటే?

praveen
దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో కూడా అక్కడక్కడ ఇంకా మూఢ నమ్మకాలు రాజ్య మేలుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు వెలుగు లోకి వస్తున్న కొన్ని ఘటనలు చెప్పకనె చెబుతున్నాయి. ఇంకా మంత్రాలకు చింత కాయలు రాలుతాయి అని నమ్ముతున్న ఎంతో మంది క్షుద్ర పూజలు పేరుతో ఎంతో మంది ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 ఈ క్రమం లోనే క్షుద్ర పూజలు పేరుతో నేటి ఆధునిక యుగం లో కూడా అటు నరబలులు ఇస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కి పడేలా చేస్తూ ఉన్నాయి. ఇక ఇటీవల ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. ఎక్కడ ప్లేస్ దొరకలేదు అన్నట్లుగా ఏకంగా ఒక కాలేజీ బస్సు  లో క్షుద్ర పూజలు చేయడం మరింత సంచలనంగా మారి పోయింది అని చెప్పాలి. ఏకంగా కాలేజీ బస్సులో పసుపు కుంకుమ నిమ్మ కాయలు కనిపించడం తో విద్యార్థులు అందరూ భయాందోళనకు గురయ్యారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది.

 కృష్ణ రావు పాలెం లో ఒక క్షుద్ర పూజలు కలకలం రేపడం తో ఒక్క సారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. విస్సన్న పేటకు చెందిన వికాస్ కాలేజీ బస్సులో గుర్తు తెలియని దుండగులు ఇక ఇలా క్షుద్ర పూజలు చేసినట్లు తెలుస్తుంది. పార్కింగ్ చేసి ఉన్న బస్సులో పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే నిమ్మకాయలు అన్నం పసుపు కుంకుమ వేశారు గుర్తు తెలియని దుండగులు. దీంతో మరునాడు ఇక ఎప్పటిలాగానే కాలేజీకి వెళ్లేందుకు సిద్ధమైన విద్యార్థులు బస్సుఎక్కగానే అక్కడ కనిపించిన సీన్ చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే కళాశాల సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: