భర్తను వదిలి ప్రియుడు కోసం వచ్చింది.. కానీ చివరికి?

praveen
ప్రేమ అనేది ఒక మధురమైన జ్ఞాపకం. ప్రేమలో పడిన తర్వాత ఇక జీవితాంతం సరిపోయే తీపి జ్ఞాపకాలు మిగులుతూ ఉంటాయి అని ఎన్నో ప్రేమ జంటలు చెబుతూ ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో మాత్రం ప్రేమ అనేది మోసానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఆన్లైన్ లో పుడుతున్న ప్రేమలు చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆన్లైన్లో పరిచయమైన వారితో ప్రేమ అనే పేరుతో హద్దులు దాటుతున్నారు నేటి రోజుల్లో యువత. చివరికి కొన్నాళ్లకే మోసపోయమని గ్రహించి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక యువతకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని చెప్పాలి.

 ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడితో ఆ యువతి ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు.  కానీ అంతలో కుటుంబ సభ్యులు వేరొకరితో ఆమెకు పెళ్లి చేసి దుబాయ్ పంపించేశారు. కానీ మాజీ ప్రియుడిని మర్చిపోలేకపోయింది ఆ యువతి. ఇక అతను కోరడంతో మళ్ళీ హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చింది. అయితే ఇక ఇలా తనకోసం తిరిగి వచ్చిన ప్రియురాలితో సహజీవనం చేసిన యువకుడు కొన్నాళ్ళకు ముఖం చాటేసి వేరొకరితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.

 హైదరాబాద్ నగరంలోని బోరబండ రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి టెలికాలర్గా పనిచేస్తుండగా.. ఇంస్టాగ్రామ్ లో ఐదేళ్ల క్రితం మహారాష్ట్ర జెల్ గావ్ కు చెందిన సైఫ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇక పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు సహజీవనం కూడా చేయడం మొదలుపెట్టారు. అయితే కుటుంబ సభ్యులు ఇక వేరొకరితో పెళ్లి చేసి యువతిని దుబాయ్ పంపించిన ప్రియుడు కోసం మళ్లీ హైదరాబాద్ కి వచ్చింది. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సైఫ్ కొన్నాళ్లపాటు సహజీవనం చేసి ఆ తర్వాత ముఖం చాటేసాడు. దీంతో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: