దారుణం : కుక్కను కుక్క అన్నందుకు.. చంపేశారు?

praveen
ఇటీవల కాలం లో వెలుగు చూస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి ఆలోచన తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే రియాక్ట్ కావాల్సిన విషయాలకు సైలెంట్ గా ఉంటున్న మనిషి ఇక అనవసరమైన విషయాలకు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఇక ఎన్నో నేరాలకు పాల్పడుతున్న ఘటనలు నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం.

 చిన్నచిన్న కారణాలకే మానవత్వాన్ని మరిచిపోయి అడవుల్లో ఉండే మృగం కంటే రాక్షసత్వం తో ప్రవర్తిస్తున్న మనిషి సాటి మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటాలు ఇటీవల కాలం లో కోకోళ్లలుగా వెలుగు లోకి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో పెంపుడు కుక్కలను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న వారు వాటిని ఎవరైనా తిట్టారు అంటే చాలు సాటి మనుషులను చంపేందుకు కూడా సిద్ధమైపోతున్నారు అని చెప్పాలి. మొన్నటి వరకు ఇలాంటి ఘటనలు సినిమాల్లోనే కనిపించగా.. ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా జరుగుతున్నాయి.

 ఇటీవల తమిళనాడు లో కూడా ఇలాంటి ఒక దారుణ ఘటన వెలుగు లోకి వచ్చి ప్రతి ఒక్కరిని ముక్కున వేలేసుకునేలా చేసింది. తమ పెంపుడు కుక్కను పేరు పెట్టి పిలవ కుండా కుక్క అని అన్నందుకు ఒక వ్యక్తి నీ దారుణం గా హత్య చేశారు. దిండిగల్ జిల్లా తడింకోబు లో కుక్కను పెంచుకుంటున్న తల్లి ఇద్దరు కుమారులు తమ కుక్కను కుక్క అనకుండా దాని పేరుతో పిలవాలని 62 ఏళ్ళ రాయప్ప న్ అనే వ్యక్తికి వార్నింగ్ ఇచ్చారు. అయితే అతను మాత్రం కుక్క అని సంబోధించడం తో కోపంతో అతని విచక్షణ రహితం గా  కొట్టడం తో చివరికి అతను ప్రాణాలు వదిలాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: