చైనా మంజా.. పోలీసుకే షాక్ ఇచ్చింది?

praveen
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఇక అన్ని కుటుంబాల్లో కూడా ఆనందం వెళ్లి విరుస్తుంది అని చెప్పాలి. ఏకంగా దూరంగా ఉన్న పిల్లలందరూ కూడా సంక్రాంతి పండుగకు ఇంటికి చేరుకుంటారు. చదువులు ఉద్యోగాల కోసం వెళ్ళిన వారు సొంత ఊరికి వచ్చేస్తూ ఉంటారు.  అప్పటివరకు బిజీ లైఫ్ గడిపిన వారందరూ కూడా సంక్రాంతికి సొంతూరుకు చేరుకొని కాస్త చిల్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీంతో రంగరంగుల రంగవల్లులు.. సాంప్రదాయ వస్త్రధారణలో యువతి యువకులు ఇక కోడిపందాలు ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి.

 ఇలా సంతోషానికి కేరాఫ్ అడ్రస్ అయిన సంక్రాంతి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని కూడా నింపుతుంది అని చెప్పాలి. ప్రతిఏటా ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఎంతోమంది సంతోషంగా ఎగరవేస్తున్న గాలిపటాలు.. చివరికి అభం శుభం తెలియని ప్రాణాలు పోయే పరిస్థితిని తీసుకువస్తూ ఉన్నాయి. చైనా మాంజా కారణంగా ఎంతో మంది వాహనదారులు చివరికి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వెలుగు చూసాయ్. అయితే చైనా మాంజా వాడొద్దు  అంటూ పోలీసులు కూడా అవగాహన చర్యలు చేపడుతున్నారు. ఇక ఇప్పుడు చైనా మాంజా నుంచి ఏకంగా పోలీసులకే ప్రాణాపాయం ఏర్పడింది అని చెప్పాలి.

 ఇటీవలే బైక్ పై పూనే సతారా రోడ్డులో వెళ్తున్న సమయంలో గాలిపటం మాంజా చుట్టుకుని ఇక పోలీసులు తీవ్ర గాయాల పాలయ్యారు.  శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ కు చెందిన పోలీసులు మహేష్ పవర్, సునీల్ లు బైక్ పై వెళ్తున్న సమయంలో ఇక మాంజా వారి మెడకు చుట్టుకోవడంతో ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ క్రమంలోనే ఒక పోలీస్ కైతే గొంతు కూడా కోసుకుపోయింది. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా ఇక మరో పోలీస్ చేతికి కూడా గాయాలయ్యాయి అని చెప్పాలి. అయితే మాంజాను అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినప్పటికీ కొంతమంది మాత్రం రహస్యంగా ఇలాంటి మాంజాలు  అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: