రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు ప్రాణం తీసారు?

praveen
భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పరిస్థితులుగా హాట్ హాట్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరుదేశాల సరిహద్దుల్లో పచ్చగడ్డి వేసిన బగ్గు మంటుంది అన్న విధంగానే ఎప్పుడు ఉధృతకర పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయ్. ఏకంగా ఈ ప్రాంతంలోనే పాకిస్తాన్ కు చెందిన ఎంతో మంది ఉగ్రవాదులు భారత్ లోకి క్రమంగా చొరబడి ఉగ్ర కుట్రలకు  పాల్పడి మారణ హోమాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

 అయితే ఒకప్పుడు కాశ్మీర్లో 370 ఆర్టికల్ అమలులో ఉన్న నేపథ్యంలో ఉగ్రవాదుల ఆటలు సాగేవి. కానీ ఇప్పుడు మాత్రం అక్కడ 370 ఆర్టికల్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం ఉగ్రవాదుల ఆటలు సాగడం లేదు అని చెప్పాలి. ఎప్పటికప్పుడు భారత సరిహద్దు దళాలు అప్రమత్తంగా ఉంటూ ఉగ్రవాదులను మట్టు పెడుతూనే ఉన్నాయి. ఏకంగా ఇటీవల కాలంలో అయితే జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో భారత ఆర్మీ ఎంతో మంది ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే.

 అయినప్పటికీ ఉగ్రవాదులు మాత్రం రెచ్చి పోతూ కాల్పులకు పాల్పడుతూనే ఉన్నారు. మరో సారి ఇలాంటి ఘటన జరిగింది.  జమ్మూ కాశ్మీర్ లోని రాజవౌరీ జిల్లాలో ఉగ్ర వాదులు మరో సారి రెచ్చి పోయారు. విచక్షణ రహితం గా కాల్పులు జరిపిన నేపథ్యం లో ముష్కరుల  కాల్పుల్లో ముగ్గురు కాశ్మీరీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు అన్నది తెలుస్తుంది. డాంగ్రీ గ్రామం లోకి ప్రవేశించిన ఇద్దరు ఉగ్ర వాదులు దారుణం గా కాల్పులు జరపడం గవనార్హం. ఈ దాడిలో ముగ్గురు పౌరులు చనిపోగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే భద్రతా బలగాలు సంఘటన స్థలానికి చేరుకుని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయ్. కాగా డిసెంబర్ 16వ తేదీన రాజౌరీలోని సైనిక శిబిరం వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు చనిపోయారు అన్న విషయం తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: