ఆధార్ తో బ్యాంకు ఖాతా ఖాళి.. వీడు మామూలోడు కాదు?

praveen
ఇటీవల కాలంలో టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీలు అయితే ఎంతో సులభతరంగా మారిపోయాయి. ఒకప్పుడు ఎలాంటి లావాదేవైనా జరపాలన్న బ్యాంకుకు వెళ్లి పడి గాపులు కాచాల్సిన పరిస్థితి  ఉండేది. కానీ ఇప్పుడు అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఒక్క క్లిక్ ఇస్తే చాలు ఎలాంటి లావాదేవీ అయినా పూర్తి చేసేందుకు వెసులుబాటు ఉంది. దీంతో జనాలు టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. అయితే పెరిగిపోయిన టెక్నాలజీ అటు నేరస్తులకు కూడా బాగా ఉపయోగపడుతుంది.

 టెక్నాలజీ పై తమకున్న పట్టుని మంచి పనులకు కోసం కాకుండా నేరాలకు పాల్పడేందుకు ఉపయోగిస్తున్నారు. తద్వారా ఇక సైబర్ నేరాలకు పాల్పడుతూ ఎంతో మంది అమాయకుల ఖాతాలను ఖాళీ చేస్తున్న ఘటనలు రోజురోజుకు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆధార్ ద్వారా బ్యాంక్ అకౌంట్లను ఖాలి చేస్తున్న నేరస్తుల పెరిగిపోయారు. కాగా తెలంగాణ పోలీసులు ఇలాంటి నేరస్తున్ని ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని కిషన్ గంజ్ జిల్లా కొచ్చడ మాన్ కు చెందిన అక్మల్ అలమ్ అనే వ్యక్తి హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు చోరీ చేసినట్లు ఫిర్యాదు రాగా.. ఇక తెలంగాణ సిఐడి పోలీసులు నేరస్తున్ని పట్టుకున్నారు.

 ఇటీవల కాలంలో వివిధ బ్యాంకులు ఖాతాదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించెందుకోసం ఏఈపిఎస్ పేరుతో ప్రత్యేకమైన సేవలు అందిస్తున్నాయి. అయితే ఇక ఈ సేవలను పొందాలంటే ముందుగా ఆధార్ నెంబర్ తో పాటు వేలిముద్రలను కూడా బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. ఇక వేలిముద్ర ద్వారానే నగదు ఉపసంహరణ నగదు డిపాజిట్ నగదు బదిలీలు లాంటివి కూడా నిర్వహించేందుకు అవకాశం ఉంది. అయితే ఇక ఈ సరికొత్త సౌలభ్యాన్ని తనకు ఆసరాగా తీసుకున్న నిందితుడు అక్మాల్ తెలంగాణకు చెందిన ఓ ఎస్బిఐ బ్యాంక్ ఖాతాదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు కాజేశాడు. సిలికాన్ మోడ్ తో డూప్లికేట్ వేలిముద్రలను తయారుచేసి బ్యాంక్ ఎటిఎంలలో వేలిముద్రల ద్వారా ఇక ఆధార్ నుంచి డబ్బు విత్ డ్రా చేయడం లాంటివి చేశాడు. ఇటీవల వరుసగా పోలీసుల ఫిర్యాదు అందుకోవడంతో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితున్ని పట్టుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: