రోడ్డుపై మూత్రం పోయోద్దన్న కానిస్టేబుల్.. అతనేం చేశాడో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో మనుషులు మానవత్వం ఉన్న మనుషుల్లా కాదు మానవ మృగాలుగా మారిపోతున్న మనుషుల్లాగే కనిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే ఉన్మాదులుగా మారిపోతూ సాటి మనుషుల ప్రాణాలను ఎంతో ఈజీగా తీసేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈ కోవలోకి చెందింది అని చెప్పాలి.

 ఇటీవల కాలంలో ఎంతోమంది పెద్దపెద్ద నగరాల్లో సైతం ఇక కనిపించిన గోడపై మూత్రవిసర్జన చేయడం లాంటివి చేస్తున్నారు అక్కడక్కడ. ఇక ఎంతో మంది జనాలకు ఇబ్బంది పడకుండా సులబ్ కాంప్లెక్స్ లను కట్టించినప్పటికీ కూడా రోడ్డుపై మూత్ర విసర్జన చేయడం తమ హక్కు అన్న విధంగానే కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఎవరైనా ఇలా రోడ్డుపై మూత్ర విసర్జన చేయొద్దని మందలిస్తే వారిపై దాడి చేయడం లాంటి ఘటనలు కూడా ఇటీవల వెలుగు వస్తున్నాయ్. ఇక్కడ ఏకంగా ఒక వ్యక్తి రోడ్డుపై మూత్ర విసర్జన చేయొద్దు అన్నందుకు పోలీస్ కానిస్టేబుల్ పైనే దాడికి పాల్పడ్డాడు.

 ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో వెలుగులోకి వచ్చింది. ఏక్తా నగర్ కు చెందిన రామ్ గొంతే అనే వ్యక్తి కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు  అయితే ఇటీవల రాత్రి సమయంలో ఖండి వాలిలో నడిరోడ్డుపై మూత్రవిసర్జన చేస్తున్నాడు  దీనిని గమనించిన ఉదయ్ అనే కానిస్టేబుల్ అతడిని అడ్డుకున్నాడు. బహిరంగంగా మూత్రవిసర్జన చేయవద్దని పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించుకోవాలని సూచించాడు. దీంతో ఇక రామ్ గొంతే కానిస్టేబుల్ తో గొడవకు దిగాడు  ఎంత చెప్పినా వినకపోవడంతో చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు కానిస్టేబుల్. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రామ్ తన కూరగాయల బండి పై ఉన్న కత్తితో కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ రెండు చేతులను తీవ్రంగా గాయపరిచాడు. సమాచారంఅందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడిన కానిస్టేబుల్ ను ఆసుపత్రికి తరలించారు   రామ్ గొంతేను అదుపులోకి తీసుకొని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: