500 కిలోల గంజాయి స్వాహా.. పోలీసులు ఏం కారణం చెప్పారో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో దేశంలో గంజాయి అక్రమ రవాణా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి ఇక అన్ని వాహనాలను తనిఖీలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక అక్రమార్కులు పోలీసుల కలుగప్పి గంజాయి అక్రమ రవాణా చేయడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్న పోలీసులు ఇక అక్రమార్కుల ఆటలకు అడ్డుకట్టవేస్తూ ఇక భారీగా గంజాయిని పట్టుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.

 సాధారణంగా ఇలా పోలీసులు తనిఖీలలో గంజాయిని పట్టుకున్న సమయంలో ఇక గంజాయిని భద్రంగా ఉంచి కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలో పూర్తి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఖాకీలు మాత్రం గంజాయిని పట్టుకోవడమే కాదు ఇక తర్వాత ఆ గంజాయిని స్వాహా చేస్తూ ఖాకి చొక్కాకే మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 500 కిలోల గంజాయిని పట్టుకుని పోలీసులు ఆ గంజాయిని ఎలుకలు తినేసినట్లు స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనంగా మారిపోయింది.

 ఇటీవలే ఒక కేసులో నార్కోటిక్స్ డ్రగ్స్ కోర్టుకు సమర్పించిన రిపోర్టులు మధుర పోలీసులు ఇక ఇలాంటి రిపోర్టును అధికారులకు అందజేయడం గమనార్హం. షేర్ ఘర్, హైవే పోలీస్ స్టేషన్లలో దాచిపెట్టిన 500 కిలోల గంజాయిని ఎలుకలు తిన్నాయని పోలీసులు తెలిపారు. వేరు వేరు దాడుల్లో స్వాధీనం చేసుకున్న 586 కేజీల గంజాయిని వెంటనే సరెండర్ చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేయగా.. ఇక పోలీసులు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక పోలీస్ స్టేషన్లో ఎలుకల నుంచి దాచిపెట్టే వస్తువు ఏదీ లేదని.. అంతేకాకుండా సీజ్ చేసిన గంజాయిలో కొంత మొత్తాన్ని పోలీసులు తగలబెట్టారని ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించడం గమనార్హం.

 చిన్న సైజులో ఉండే ఎలుకలు పోలీసులకు భయపడటం లేదని.. ఈ సమస్యను పరిష్కరించడంలో పోలీసులు కూడా నిపుణులు కాదు కదా అంటూ పోలీసులు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదన వినిపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నార్కోటిక్ కోర్టు ఎలుకలు గంజాయిని తిన్నాయి అని చెప్పడానికి సాక్షాధారాలను చూపించాలి అంటూ కోరింది. ఎలుకలను చంపేసి ఆధారాలను చూపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: