శివయ్య పిలుస్తున్నాడు అంటూ.. యువకుడు ఏం చేశాడో తెలుసా?

praveen
ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న సమయంలో కొంతమంది మాత్రం ఇంకా మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతూ ఉన్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. వెరసి మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్ముతూ చివరికి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు అవాక్కవుతారు. తనను శివుడు పిలుస్తున్నాడు అంటూ చెప్పి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరిని షాక్ కి గురి చేసింది.

 ఈ ఘటన ఎక్కడో కాదు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చాట్లమాడ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే గ్రామానికి చెందిన వెంకట పూర్ణ శేఖర రెడ్డికి శివుడు అంటే ఎంతో ఇష్టం. కాగా తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకొని తల్లి చెల్లిని చూసుకుంటున్నాడు. అదే సమయంలో ఇక బీటెక్ నాలుగో సంవత్సరం కూడా చదువుతున్నాడు. కాగా ఇటీవల చెన్నై నుంచి స్వగ్రామానికి వచ్చాడు యువకుడు.

 ఇంట్లో ఎవరు లేని సమయం చూసి శివయ్య పిలుస్తున్నాడు అంటూ సూసైడ్ నోట్లో రాసి చివరికి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను పిరికివాడిని కాదని కేవలం శివుడు పిలవడం వల్లే ఆత్మహత్య చేసుకున్న అంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తన తండ్రి కూడా శివయ్య దగ్గర సేవ చేస్తున్నాడని.. అందుకే అక్కడికే వెళ్లిపోతున్న అంటూ సూసైడ్ నోట్లో రాశాడు. ఇక తన చెల్లెలిని తల్లిని బంధువులు బాగా చూసుకోవాలని కోరాడు. అంతే కాదు చెల్లికి మంచి వరుడుని చూసి పెళ్లి చేయాలంటూ సూసైడ్ నోట్లో తెలపాడు. కేవలం శివయ్య పిలుస్తున్నందుకే సూసైడ్ చేసుకుంటున్నాను అంటూ తెలిపాడు. ఇక అతని మృతితో కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: