భర్త అలా చేయలేదని.. ఆత్మహత్య చేసుకున్న భార్య?

praveen
ఇటీవల కాలంలో మనషుల ఆలోచనా తీరు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పాలి. కొత్త జీవన  శైలి లోకి అడుగు పెడుతున్న మనిషి ప్రతి విషయం లో ఎంతో హుందాగా ఆలోచించాల్సింది పోయి క్షణికావేశం లో  నిర్ణయాలు తీసుకుంటున్నాడు. బావోద్వేగాలను   కంట్రోల్ చేసుకోవాల్సింది పోయి చివరికి కోపానికి మనస్థాపానికి తలవంచుతు బలవన్మరణానికి పాల్పడటం చేస్తున్నాడు. ముఖ్యం గా ఇటీవలి కాలం లో చిన్నచిన్న కారణాలకే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి అని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. ఇంట్లో ఉన్న కుక్క పిల్లను వేరే వాళ్ళకి ఇచ్చేందుకు మిగతా కుటుంబ సభ్యులు నిరాకరించడంతో చివరికి తల్లీకూతుళ్లు మనస్థాపం చెంది కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్న ఈ ఘటన కర్నాటక రాజధాని బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. దివ్య అనే 36 ఏళ్ల మహిళకు కుక్కలు అంటే పరమ చిరాకు.. ఆమెకు ఎలర్జీ ఉంది.

 అయితే గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న దివ్య వైద్యులను సంప్రదించింది. అయితే ఇదంతా ఇంట్లో కుక్కలు ఉండటం కారణంగానే వచ్చిన ఎలర్జీ అని వైద్యులు తేల్చి చెప్పారు. మీకు కుక్కలు అంటే పడవు. వాటికి దూరంగా ఉండటం బెటర్ అంటూ సూచించారు..ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది ఆమె. ఇంట్లో ఉన్న కుక్కను ఎవరికైనా ఇచ్చేయాలి అంటూ కోరింది. కానీ అందుకు అత్తామామలు మాత్రం ఒప్పుకోలేదు. దీంతో ఎంతగానో మనస్తాపం చెందిన ఆమె ఆరో తరగతి చదువుతున్న కుమార్తె తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: