బాల్య వివాహం.. బాలిక ప్రాణం తీసింది.. ఏం జరిగిందంటే?

praveen
టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న నేటి ఆధునిక సమాజంలో కూడా ఇంకా అక్కడక్కడా బాల్య వివాహాలు జరుగుతూ ఉండటం గమనార్హం. బాల్య వివాహాల కారణంగా ఇక ఎంతో మంది బాలికలు జీవితాలు ప్రమాదంలో పడిపోతున్నాయ్ అని చెప్పాలి. అధికారులు ఎంత అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ బాల్యవివాహాలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి ఘటన  వెలుగులోకి వచ్చింది.  ఏకంగా బాల్య వివాహం ఒక బాలిక ఉసురు తీసింది. ఏడో తరగతి చదువుతున్న బాలిక కు 30 ఏళ్లు దాటిన వ్యక్తితో వివాహం జరిపించారు.

 అయితే శారీరక వికాసం లేని సదరు బాలిక చివరికి గర్భవతి అయింది. దీంతో శిశు తో పాటు బాలిక కూడా ప్రాణాలు వదిలింది. హృదయ విదారక ఘటన కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. చల్లపల్లి మండలం పురిటిగడ్డ ప్రాంతానికి చెందిన ఎస్టి బాలిక ఏడో తరగతి చదువుతుండగా.. ఆమెకు తండ్రి లేడు. అయితే శారద నగర్ కు చెందిన 30 ఏళ్లు దాటిన వ్యక్తికి  బాలికను ఇచ్చి వివాహం చేసింది తల్లి. తనకు ఇష్టం లేదు అని చెప్పినా కూడా వినలేదు. ఇక చివరికి శారీరకంగా అప్పటికి ఎదుగుదల లేని అమ్మాయి పెళ్లి అయిన తర్వాత గర్భం దాల్చింది.

 తన కూతురు తల్లి కాబోతుంది అని బాలిక తల్లి ఎంతో సంతోష పడి పోయింది. కానీ నెలలు గడుస్తున్నా కొద్దీ బాలిక ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. చివరికి ఓ రోజు పుట్టింటికి చేరుకుంది బాలిక. పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు చేతులెత్తేయడంతో చివరికి విజయవాడలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. పదిహేను రోజుల క్రితమే బాలిక గర్భంలో ఉన్న శిశువు మృతి చెందగా రెండు రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించి బాలిక కూడా మరణించింది. అయితే ఈ విషయం ఎక్కడా బయటకి పొక్కకుండా అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన కాస్త  సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: