కొడుకు పోయిన బాధలో తండ్రి.. 2 నెలల తర్వాత కోడలి ఫోన్ చెక్ చేయగా?

praveen
అంత సంతోషంగా సాగిపోతున్న సమయంలో ఆ పెద్దాయన జీవితంలో ఇటీవలే అనుకోని విషాదకర ఘటన జరిగింది. ఇటీవలే తనకు ఎంతో ఇష్టమైన కొడుకు ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ పెద్దాయన తీవ్ర దుఃఖంలో మునిగి పోయాడు అని చెప్పాలి. ఇలా కొడుకు పోయిన బాధ లో దాదాపు రెండు నెలలు గడిచిపోయాయి. ఈ క్రమంలోనే ఇక కొడుకు ఈ లోకంలో లేడు అన్న విషయాన్ని ఆ పెద్దాయన జీర్ణించుకోలేకపోతున్నాడు అనే చెప్పాలి. అయితే ఇటీవలే పొరపాటున కోడలి పాత ఫోన్ తన దగ్గర ఉండడంతో అందులో చూసి  చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాడు.

 ఇన్నాళ్ళ వరకు తన కొడుకు ది సహజ మరణం అనుకున్నానని.. కానీ తన కొడుకు మరణం వెనుక ఏదో మిస్టరీ దాగి ఉంది అని అనుమాన పడటం మొదలు పెట్టాడు. వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి తనదైన శైలిలో విచారణ జరగడంతో అసలు నిజాలు బయట పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోని వెలుగు చూసింది ఈ ఘటన. కాకినాడ   ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేస్తున్నాడు అక్బర్ అజాం. మొదటి భార్య చనిపోవడంతో యానాంకు చెందిన అహ్మదున్నిసా ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు సదరు వ్యక్తి.

 అయితే జూన్ 23వ తేదీన ఇంట్లో ప్రాణాలు వదిలాడు అక్బర్. సహజ మరణమే అయి ఉంటుందని భావించిన తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా గతంలో అక్బర్ తన భార్యకు కొత్త ఫోన్ కొనిచ్చాడు. భార్య పాత మొబైల్ లో అతని తండ్రికి ఇచ్చాడు. కాగా ఇటీవలే   సదరు వృద్ధుడు ఆ ఫోన్లో చూస్తూ ఉండగా ఒక వాయిస్ మెసేజ్ బయటపడింది.  అపార్ట్మెంట్లో ఉంటున్న రాజేష్ కిరణ్ అనే యువకుడు తో కలిసి తన కోడలే కొడుకును హత్య చేయించిందని విషయం అతనికి అర్థమైంది. వాళ్ళిద్దరు తో ఎఫైర్ నడపటం కారణంగానే ఈ దారుణానికి పాల్పడిందని భావించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసాడు. విచారణ చేపట్టిన పోలీసులుసదరు మహిళ తో పాటు ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: