బాలుడిపై అత్యాచారం.. కోర్టు షాకింగ్ తీర్పు?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత సభ్యసమాజంలో బ్రతుకుతున్నది మనుషులా లేకపోతే మనిషి రూపంలో ఉన్న మానవ మృగాల అన్నది కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే సాటి మనుషులకు చిన్న ప్రమాదం వస్తే అయ్యో పాపం అంటూ జాలిపడే మనుషులు ఇక ఇప్పుడు సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. మరి ముఖ్యంగా క్షణకాల సుఖం కోసం మానవ మృగాలుగా మారిపోతున్నారు. దారుణంగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి.

 ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు దారుణంగా హత్యాచారాలు చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది అక్కడితో ఆగకుండా హత్యలకు సైతం పాల్పడుతున్న ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయని చెప్పాలి. వెరసి రోజురోజుకీ ఆడపిల్ల ధైర్యంగా బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవలి కాలంలో కేవలం  ఆడ పిల్లల పైనే కాదు బాలుర పైన కూడా అత్యాచారాలు జరుగుతూ ఉండటం సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. కామంతో కళ్లు మూసుకుపోతున్న మానవమృగాలు ఆడా మగా అనే తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

 అయితే ఇటీవలే బాలుడిపై లైంగిక దాడి జరిగిన కేసులో కోర్టు షాకింగ్ తీర్పు వెలువరించింది అని చెప్పాలి. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి కి చెందిన తిరుపతి రావు అనే 32 ఏళ్ల వ్యక్తి 2021 సంవత్సరంలో ఆగస్టు 22వ తేదీన బాలుడిపై లైంగిక దాడి చేశాడు. ఈ క్రమంలోనే చిత్రహింసలకు గురి చేశాడు. ఇంటికి ఏడుస్తూ వచ్చిన బాలుడిని గమనించిన తల్లి ఏం జరిగింది అని అడగగా.. బాలుడు చెప్పిన నిజం తో  ఒక్క సారిగా షాక్ అయింది.. కాగా బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా పోలీసులు ఆధారాలను సేకరించి కోర్టులో  నిందితుని హాజరు పరిచారు. విచారణ జరిపిన విజయవాడ పోక్సో కోర్టు అతనికి జీవితకాల జైలుశిక్షతో పాటు 10 వేల జరిమానా విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: