సముద్రంలో తేలుతూ కనిపించిన బ్యాగ్.. ఏంటా అని తెరిచి చూస్తే?

praveen
సాధారణం గా రోడ్డుపై వెళ్తున్నప్పుడు కానీ లేదా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కానీ కొన్ని కొన్ని అనుమానాస్పదం గా కనిపించడం లాంటివి జరుగుతుంటాయి. రోడ్డు పక్కన ఏదైనా సంచి అనుమానాస్పదం గా కనిపించింది అంటే అందులో ఏముందో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు అని చెప్పాలి.  ఒకవేళ అదేంటో చూడకుండా వెళ్తే మనసులో అదే ఆలోచన మెదులుతూ ఉంటుంది. కాగా సముద్రం లో కూడా ఇలాంటివి చిత్ర విచిత్రమైన వస్తువులు అప్పుడప్పుడు కొట్టుకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి.

 ఇక ఇలాంటి బ్యాగ్ లను  తెరిచి చూసినప్పుడు కొన్ని కొన్ని సార్లు ఖాళీగా కనిపిస్తే మరికొన్నిసార్లు అవాక్కయ్యే నిజాలు బయట పడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవల తమిళనాడు లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది అనే చెప్పాలి. ఇటీవలి కాలంలో గంజాయి స్మగ్లర్లు అక్రమం గా గంజాయి రవాణా చేసేందుకు ఉన్న ఏ మార్గాన్ని వదిలి పెట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే రామేశ్వరం సమీపంలో సముద్ర తీరం లో తేలియాడుతూ ఒక బ్యాగ్ కనిపించింది.

 ఈ క్రమం లోనే అదే ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న కోస్ట్గార్డ్ ఆ బ్యాగును గమనించాడు. దీంతో బ్యాక్ అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే బ్యాక్ దగ్గరికి వెళ్లి ఓపెన్ చేసి చూశాడు. దీంతో అందులో గంజాయి ఉండటం చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఆ బ్యాగ్ స్వాధీనం చేసుకున్నాడు అన్నది తెలుస్తుంది.  ఇక ఒక్కొక్కటి మూడు కిలోల బరువు ఉన్న 20 పాకెట్ల గంజాయి ఆ సంచిలో ఉన్నట్లు గుర్తించారు. ఇక ఆ గంజాయిని స్థానిక కస్టమ్స్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. శ్రీలంకకు పెద్ద సంఖ్యలో తరలించిన  గంజాయి లో ఈ సంచి కూడా ఒక భాగమని ప్రాథమిక విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bag

సంబంధిత వార్తలు: