బాలికపై అత్యాచారం.. కోర్టు షాకింగ్ తీర్పు?

praveen
ఇటీవల కాలంలో అటు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదో ఒక రాష్ట్రానికి మాత్రమే ఇలాంటి ఘటనలు పరిమితం కాలేదు. ఏకంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా మహిళల భద్రతను ప్రశ్నార్థకం గా మార్చే విధంగా మహిళలపై అత్యాచారాలు హత్యలు  వెలుగులోకి వస్తున్నాయి. అయితే మొన్నటి వరకు మహిళ ఎక్కడైనా ఒంటరిగా కనిపిస్తే అత్యాచారాలు చేసేవారు కామాంధులు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం మరింత రెచ్చిపోతున్నారు. పక్కన కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వెనకడుగు వేయకుండా వారిపై దాడి చేసి మరీ అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ప్రతిఒకరిని భయాందోళనకు గురిచేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇలా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఆడపిల్ల ధైర్యంగా కాలు బయట పెట్టలేని దుస్థితి ఏర్పడింది నేటి రోజుల్లో. అయితే ఆడ పిల్లల పై అత్యాచారం చేసుకున్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో అటు కోర్టులు కూడా నిందితులకు కఠినమైన శిక్షలు విధిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఒక  నిందితుడికి కోర్టు ఏకంగా 25 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు తెలుస్తోంది.

 ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాలికను లైంగికంగా వేధించిన కేసులో విచారణ జరిపిన మెదక్ జిల్లా కోర్టు నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా కోర్టులో సమర్పించారు. ఇక ఈ కేసు పై ఎంతో సీరియస్గా విచారణ జరిపిన మెదక్ కోర్టు పాపన్న పేట కు చెందిన నిందితుడు కి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 31 వేల జరిమానా కూడా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: