యూట్యూబ్ లో చూసి చోరీ చేశాడు.. చివరికి?

praveen
ఇటీవలి కాలంలో యూట్యూబ్ వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ యూట్యూబ్ ఆకర్షిస్తుంది అని చెప్పాలి. అంతే కాదు నేటి రోజుల్లో యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా మారిపోయింది. ఎలా అంటే ఇటీవలి కాలంలో ఎంతోమంది యూట్యూబ్ లో చూసి చదువుకుంటున్నారు. మరికొంతమంది యూట్యూబ్ లోనే చూసి కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. ఇక అన్ని విషయాలకు సంబంధించిన సమాచారం కూడా యూట్యూబ్ లో లభిస్తుంది. దీంతో కొంతమంది ఏకంగా నేరాలకు  పాల్పడటం ఎలా అన్న విషయాన్ని కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకుని నేరాలకు పాల్పడుతున్న వెలుగులోకి వస్తున్నాయి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇటీవలికాలంలో  దొంగలు పక్కాగా స్కెచ్ వేసి చోరీలకు పాల్పడి ఏకంగా పోలీసులకు షాక్ ఇస్తున్నారు. ఇళ్లలో దొంగతనాల చేస్తే ఏం వస్తుంది అనుకుంటున్నారో ఏమో ఏకంగా బ్యాంకులు ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. కరీంనగర్ లో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. డ్రైవర్గా పనిచేస్తున్న ఓ యువకుడు అప్పులు తీర్చేందుకు చివరికి దొంగలుగా మారిపోయాడు. యూట్యూబ్ లో చూసి చోరీకి ప్రయత్నించాడు. కానీ చివరికి పోలీసులకు దొరికి కటకటాలపాలయ్యాడు.

 కరీంనగర్ జిల్లా మెట్పల్లి మండలం బేగంపేట లో కెనరా బ్యాంకు ఏటీఎంలో చోరీ జరిగిన ఘటన ఇటీవల హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ కు చెందిన రాజేష్ బ్యాంకులో ఏటీఎంలలో చోరీ చేసేందుకు ప్రయత్నించినట్లు తేలింది. చివరికి అతన్ని అరెస్టు చేశారు పోలీసులు అయితే గతంలో డ్రైవర్ గా పని చేస్తూ ఉండేవాడు రాజేష్. కొన్ని సంవత్సరాల కిందట కొన్ని లక్షల వరకు అప్పు చేశాడు. హార్వెస్టర్ కొనుగోలు చేశాడు. కానీ సక్రమంగా నడవకపోవడం తో  చివరికి అప్పులు అయ్యాయి. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్ లో దొంగతనం చేయడం ఎలా అని నేర్చుకుని అందులో చూసిన విధంగానే ఇక ఏటీఎం దొంగతనానికి పాల్పడ్డాడు. చివరికి పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు పట్టుబడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: