అయ్యో దేవుడా.. తల్లి చీరే ఉరితాడు అయ్యిందే?

praveen
ఈ భూమ్మీద నూకలు బాకీ లేకపోతే ఏ రూపంలో అయినా మృత్యువు వచ్చి కబళిస్తూ ఉంటుంది అని అంటుంటారు పెద్దలు. నేటి జనరేషన్ లో ఎంతోమంది ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తు ఉంటారు. కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే వృద్ధాప్యం లోకి వచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చి చనిపోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు ప్రాణాలు తీసేస్తూ ఉంటాయి. ఇక ఇలా విధి చిన్నచూపు చూసిన సమయంలో కొన్నిసార్లు యువత మరికొన్నిసార్లు అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోతుంటారు అన్న విషయం తెలిసిందే.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అభం శుభం తెలియని ఆ చిన్నారి నవ్వును చూసి ఓర్వలేక పోయింది విధి. చివరికి తల్లి చీరకొంగునే ఉరితాడుగా మార్చేసింది. ఈ లోకాన్ని కూడా ఇంకా సరిగ్గా చూడండి ఆ చిన్నారి ప్రాణాలు తీసేసింది. దీంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఒక్కసారిగా ప్రాణాలు వదలడంతో తల్లిదండ్రులు విలపించారు. ఇక తల్లిదండ్రులు బాధపడుతున్న తీరు చూసి స్థానికులను కూడా కంటతడి పెట్టించింది  అని చెప్పాలి. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రాజేష్, ప్రసన్న జ్యోతి దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు.

 లాలాపేట లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. రాజేష్ డ్రైవర్ గా పని చేస్తూ ఉండగా ప్రసన్న కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. వీరికి తొమ్మిదేళ్ల ఎలీనా అనే కుమార్తె ఉంది. ఇంట్లో చీర తో కట్టిన ఉయ్యాలలో ఆడుకుంటుంది. ఆ చిన్నారి ఉయ్యాలలో ఊగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అది ఏలిన మెడకు చుట్టుకుంది. దీంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదు అనే విషయాన్ని జీర్ణించుకోలేక పోయినా తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: