నిద్రలోకి జారుకోవడమే.. ప్రాణం తీసింది?

praveen
సాధారణంగా మనిషి ప్రాణాలకు అసలు గ్యారెంటీ లేదు అన్నది అందరూ చెప్పే మాట. ఏ క్షణంలో ఎప్పుడు ఎలా ప్రాణం పోతుంది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది అని చెబుతూ ఉంటారు చాలా మంది. ఇక కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రం ఇది నిజమే అని అందరూ నమ్మడం ప్రారంభించారు. ఎందుకంటే కనిపించని శత్రువుతో పోరాటం చేసిన అందరూ ఏ క్షణంలో కరుణ వైరస్ దాడి చేసి ప్రాణాలు తీస్తుందో నని భయం తోనే బ్రతకడం చేశారు. ఇక ఇప్పటికీ ఈ భయం పోలేదు అనే చెప్పాలి. ఇలా కరోనా వైరస్ ఎటునుంచి దాడి చేసి ప్రాణాలు తీస్తుందో అని అందరు భయపడుతున్న సమయంలో ఇక ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎంతోమంది ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 ఇక రోజురోజుకు రోడ్డు ప్రమాదాల కారణంగా పోతున్న ప్రాణాలు సంఖ్య పెరిగి పోతూనే ఉంది అని చెప్పాలి. అతివేగం రోడ్డు నిబంధనలు పాటించక పోవడం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని చోట్ల ఇక డ్రైవర్ల నిర్లక్ష్యం ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటుంది అని చెప్పాలి. ఇటీవల ఇలాంటి ఒక ఘోరమైన ప్రమాదం జరిగింది.  రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకంగా ఇద్దరు రైతులు మృత్యువాత పడగా మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు.

 వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్ కు చెందిన మడుగు సుహాన్, చంద్రయ్య, శ్రీశైలం, చెన్నకేశవులు వ్యవసాయం చింతపండు వ్యాపారం చేస్తూ ఉంటారు. అయితే ఐనా పూర్ కు చెందిన శివకుమార్ మినీ వ్యాన్ లో చింతపండు బస్తాలను నింపుకుని తన స్నేహితుడు నవీన్ తో పాటు ఇక నలుగురు రైతులతో అర్ధరాత్రి హైదరాబాద్ బయలుదేరాడు.  పెద్ద షాపూర్ సమీపంలోకి రాగానే బెంగళూరు జాతీయ రహదారిపై నిద్రమత్తు కారణంగా శివకుమార్ ముందు ఉన్న ట్రక్ గమనించలేదు. దీంతో ఈ  ట్రక్ లో ఉన్న అందరు గట్టిగా అరవడంతో ఒక్కసారిగా తేరుకుని శివకుమార్ స్టీరింగ్ ఎడమ వైపు తిప్పాడు. దీంతో ట్రక్ బోల్తా కొట్టింది. వెనక కూర్చున్న సుహాన్ చంద్రయ్య పై చింతపండు బస్తాలు పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నకేశవులు ఆస్పత్రికి తరలించారు. శివకుమార్ స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: