భార్యపై కేసు పెట్టిన భర్త.. ఇంతకీ కారణమేంటంటే?

praveen
పోలీసులు ఎప్పుడూ నేరాలను అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించడానికి  పని చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎక్కడైనా నేరం జరిగింది అంటే చాలు అక్కడికి చేరుకొని.. విచారణ జరిపి ఇక అసలు నిజాలు తేలుస్తూ ఉంటారు. అంతే కాకుండా ప్రజలకు ఏ కష్టం వచ్చినా  పోలీసుల దగ్గరకు చేరుకుని ఫిర్యాదు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఎలాంటి ఆపద వచ్చినా ముందుగా ప్రజలందరికీ గుర్తుకువచ్చేది పోలీసులు మాత్రమే అన్న విషయం తెలిసిందే.  ఇలా పోలీసులకు ఫిర్యాదు చేసి ఇక సమస్యలను పరిష్కరించుకోవడం కూడా మంచిదే.

 కానీ ఇటీవలి కాలంలో కొంతమంది మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.  కానీ ఆ ఫిర్యాదు చేయడానికి గల కారణాలు తెలిసి అటు పోలీసులు షాక్ అవుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఊహించని విషయాలకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఇక అక్కడ న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఒక భర్త ఏకంగా భార్య తీరుతో అసంతృప్తి చెంది వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయితే అతని దగ్గర నుంచి అటు ఫిర్యాదు స్వీకరించడానికి మాత్రం పోలీసులు షాక్ అయ్యారు అని చెప్పాలి.

 ఇక సదరు భర్త పోలీస్స్టేషన్కు వెళ్లి భార్యపై ఫిర్యాదు చేసాడు అంటే ఏదో పెద్ద విషయమే ఉండి ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. అలా అనుకుంటే పొరపాటే ఎందుకంటే హోలీ పండుగకు భార్య మాంసం తీసుకొస్తే వంట చేయలేదని ఇక తన భార్య పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు వ్యక్తి. ఈ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చర్ల గౌరారం కి చెందిన నవీన్ మద్యంమత్తులో ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు.. మాంసం తీసుకొచ్చిన తరువాత తన భార్య వండటం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తమ సమయం వృధా చేసినందుకు అతనిపై కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: