అత్త అలా అనడంతో.. నవవధువు సూసైడ్?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఏడవాలో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నేటి రోజుల్లో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు కోల్పోయిన వారిని చూసి అయ్యో పాపం అనాలా.. లేకపోతే వారు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణం తెలిసి ఆశ్చర్య పోవాలా తెలియని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మునిగిపోతున్నారు. ఎందుకంటే నేటి రోజుల్లో చిన్నచిన్న కారణాలకే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి.

 దీంతో దేవుడు ఇచ్చిన ప్రాణాలను ఎంతో మంది మనుషులు స్వయంగా చేజేతులా అర్ధాంతరంగా తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆ యువతికి ఇటీవలే పెళ్లి జరిగింది కొత్త కోడలిగా అత్తారింట్లో అడుగుపెట్టింది. కోటి ఆశలతో భర్తతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకుంది. ఇక సంసారం కూడా అంతా సాఫీగా సాగిపోయింది. కానీ అంతలో ఆ యువతి అత్తయ్య అన్న ఒక చిన్న మాట నవవధువు ప్రాణం పోవడానికి కారణం అయ్యింది.

 ఘటన హైదరాబాద్ నగరం లో వెలుగులోకి వచ్చింది. ఎక్కువగా ఫోన్ మాట్లాడుతుంది అంటూ మందలించడంతో చివరికి నవవధువు ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. బోరబండలోని భరత్ నగర్ కు చెందిన పవన్ తో సికింద్రాబాద్ కు చెందిన శిల్పా కి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే కోడలు ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉండడంపై అత్తా కోపం పెంచుకుంది. ఇదే విషయంపై అత్తాకోడళ్ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో శిల్ప ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: