మైనర్ సెక్స్ @2022..నేరమా.. కాదా..!

MOHAN BABU
లైంగిక వేధింపుల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ఫోక్సో చట్టం.. మైనర్ ను క్రిమినల్స్ గా చిత్రీకరిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరు టీనేజర్స్ మధ్య ఏకాభిప్రాయ శృంగారం నేరంగా మారడంతో చట్టానికి బాధితులవుతున్నారు. తెలియక చేసిన తప్పు జీవితకాల శిక్ష అనుభవిస్తున్నారు.టీనేజ్ సెక్స్ నేరమని పిల్లలకు అవగాహన కల్పించకుండా..21వ శతాబ్దంలో వారి శరీరాన్ని నియంత్రించడం సాధ్యమా? క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ నుంచి మైనర్ లను రక్షించుకోవాల్సిన అవసరం లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 357(సి) ప్రకారం వైద్యులు వివిధ లైంగిక నేరాల గురించి పోలీసులకు రిపోర్టింగ్ చేయడం తప్పనిసరి చేయబడింది. లేకుంటే వారికి ఆరు నెలల నుంచి ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేయొద్దని తల్లీకూతుళ్లు, పోలీసులు, వైద్యులకు విన్నవించారు. కానీ మైనర్ తో లైంగిక సంబంధం పెట్టుకున్న ఆ 16 ఏళ్ల మైనర్ బాలుడి పై పోలీసులు లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేశారు. అబ్జర్వేషన్ హోమ్ కు పంపిన కొన్ని రోజులకు అతనికి బెయిల్ లభించింది. ఇక బాధితురాలైన బాలిక తరచూ సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులను కలవడంతో పాటు వైద్యులు,పోలీసులు, జడ్జిల చుట్టు విచారణ పేరుతో లెక్కలేనన్ని రోజులు గడపాల్సి వచ్చింది. బాలుడి తో తన సంబంధం గురించి అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఈ పరిస్థితులు ఆమె భావి జీవితానికి ప్రతిబంధకంగా మారాయి. 2017 లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం రొమాంటిక్ కేసులు 25 శాతం pocso కేసులకు కారణం అయ్యాయి.

సెంటర్ ఫర్ చైల్డ్ రైట్స్ అండ్ ది ఫారం అగైనెస్ట్ సెక్సువల్ ఎక్స్ ప్లాయిటేషన్ లేదా facse అధ్యయనం.. నవంబర్  2012 నుంచి జూలై 2015 వరకు ఢిల్లీ, ముంబైలోని ప్రత్యేక కోర్టుల్లో 1957 కేసులను విశ్లేషించిన తర్వాత ఈ వివరాలను వెల్లడించింది. అంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన ప్రారంభ సంవత్సరాల్లోనూ కాన్ సెక్సువల్  రిలేషన్షిప్ లో అడాల సెంట్స్ కు వ్యతిరేకంగా విచక్షణారహితంగా ఉపయోగించ బడిందని స్పష్టమైంది. ఇక 2014 లో ది హిందు నిర్వహించిన మరో విశ్లేషణలోను 40 శాతంఫోక్సో కేసులు ఈ తరహా చెందినవేనని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: