పెద్దమనిషిగా పెళ్లికి వచ్చాడు.. కానీ గిదేం పని?

praveen
ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోవాలి అని అనుకుంటున్నారు. కాస్త లేట్ అయిన పర్వాలేదు కానీ ఎలాంటి హడావుడి లేకుండా బంధుమిత్రులందరికీ సమక్షంలో పెళ్ళి జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నారూ. కేవలం సంపన్నులు మాత్రమే కాదు సామాన్యులు సైతం తమ పెళ్ళి ఘనంగా జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. సాధారణంగా ఇలా ఘనంగా పెళ్లి చేసుకోవాలి అనుకున్నవారు తెలిసీ తెలియని బంధువులందరిని కూడా పిలుస్తుంటారు. ఇక బంధు మిత్రులందరూ కూడా పెళ్లికి వచ్చారూ అంటే చాలు ఎంతో ఆనంద పడిపోతూ వుంటారూ.

 పెళ్ళికి విచ్చేసినా పెద్దలందరి ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటారు నూతన వధూవరులు. ఇక పెళ్లికి వచ్చిన పెద్దలు కూడా ఎంతో బాధ్యతాయుతంగా కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలి అంటూ వధూవరులను దీవించడం చూస్తూ ఉంటారూ. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం కాస్త విచిత్రంగా ప్రవర్తించాడు. పెళ్లికి పెద్దగా వచ్చివధూవరులను ఆశీర్వదించడం కాదు.. ఇక ఊహించని విధంగా అందరికీ షాకిచ్చాడు. పెళ్లి కి పెద్దగా వచ్చి తన చేతి వాటాన్ని చూపించాడు. ఇక్కడొక వ్యక్తి ఈ ఘటన కాస్త స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

 పెళ్లి వేడుకలో వధువు తండ్రి బ్యాగులో డబ్బులు చోరీ చేసిన వ్యక్తినీ ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓబులాపూర్ అయోధ్య నగర్ లో కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు కృష్ణ అనే 51 ఏళ్ల వ్యక్తి. ఇక ఇటీవల ఈ నెల 6వ తేదీన కీసర బోగారం రోడ్డులోని కె బి ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఒక వివాహ వేడుకకు కృష్ణ వెళ్ళాడు. ఇక వివాహ వేడుకలో పెద్దమనిషిగా వ్యవహరించి వధువు తండ్రి బ్యాగులో ఉన్న 2.35 లక్షల రూపాయల దొంగతనం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. బ్యాగ్ లో చెక్ చేసుకుని తర్వాత నగదు లేకపోవడం చూసి షాక్ అయిన వధువు తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని పట్టుకొని విచారించగా అసలు విషయం బయటికి వచ్చింది. ఇక నిందితుడి నుంచి లక్ష రూపాయలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: