ఓట్స్ తో ఇలా కూడా రెసిపీ చేయవచ్చా.?

Suma Kallamadi
సాయంత్రం పూట స్నాక్స్ తినడం చాలామందికి అలవాటు ఉండి ఉంటుంది.ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ కోసం అయినాసరే ఈవెనింగ్ సమయంలో ఎదో ఒక స్నాక్ ఐటమ్ వండి తీరాలిసిందే.అందుకనే ఇండియా హెరాల్డ్ వారు ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటమ్ ను మీకు పరిచయం చేయబోతున్నారు.అవే" ఒట్స్ మసాలా వడలు". ఇవి చేయడానికి కూడా చాలా సులువుగా ఉంటాయి. ఓట్స్ మసాలా వడలు, బయట క్రిప్సి క్రిప్సిగా, లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి.ఓట్స్ తినడం వలన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇంకా ఈ వడలు చాలా తక్కువ నూనె పీలుస్తాయి.మరి ఆలస్యం చేయకుండా ఓట్స్ మసాలా వడలు ఎలా తయారు చేయాలో చూద్దామా. !
కావాల్సిన పదార్ధాలు:
1/2 cup పచ్చి సెనగపప్పు రెండు గంటల పాటు నానా పెట్టాలి.
3/4 cup ఓట్స్
1/2 cup ఉల్లిపాయ తరుగు
3 tbsp కొత్తిమీర తరుగు
సాల్ట్
1 పచ్చి మిర్చి తరుగు
1 tsp కారం
నీళ్ళు తగినన్ని
నూనె వేయించడానికి
అల్లం తరుగు -కొద్దిగా
జీలకర్ర -కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా సెనగ పప్పుని కడిగి 2 గంటల పాటు నానబెట్టాలి. 2 గంటలు నానిన తరువాత అందులోని నీటిని ఓంపేసి, నీళ్ళు లేకుండా గట్టిగా, బరకగా పిండిలా రుబ్బుకోవాలి. తర్వాత రుబ్బుకున్న ఆ పిండిలో  ఓట్స్, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, ఉప్పు, పచ్చి మిర్చి,కారం అన్ని వేసి గట్టిగా  కలుపుకోవాలి.ఆ తరువాత అవసరాన్ని బట్టి చెంచాలతో నీళ్ళు పోసుకుంటూ పిండి, ముద్దగా అయ్యేదాకా కలుపుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో సరిపడా నూనె పోయాలి. ఆ నూనె వేడి ఎక్కిన తరువాత వేడి వేడి నూనెలో వడలు వేసి మంట మీడియం ఫ్లేం మీద పెట్టి ఎర్రగా కరకరలాడేదాక వేపుకోవాలి. అంతే వేడి వేడి ఓట్స్ మసాలా వడలు రెడీ అయినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: