సొరకాయ అండ్ కొబ్బరి పాల కూర మీకోసం. !

Suma Kallamadi
సొరకాయ కూర అంటే చాలామంది ఇష్టపడరు. కానీ సొరకాయను కూడా ఈ వారానికి ఒకసారో లేదంటే రెండు సార్లో తింటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది. సొరకాయ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.ఈ సొరకాయను కొబ్బరి పాలతో కనుక వండితే చాలా రుచికరంగా ఉంటుంది. తిన్న తరువాత కూడా పొట్టకి ఎంతో హాయిగా ఉంటుంది. ఈ సొరకాయ కూర అన్నం, చపాతీ, రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.మరి ఆలస్యం చేయకుండా సొరకాయను కొబ్బరి పాలు పోసి ఎలా వండాలో చూద్దామా. !
కావాల్సిన పదార్ధాలు
1/2 Kilo లేత సొరకాయ ముక్కలు
ఉల్లిపాయలు -1
200 ml నీళ్ళు
300 ml చిక్కటి కొబ్బరి పాలు
5 - 6 పచ్చిమిర్చి చీలికలు
2 కరివేపాకు రెబ్బలు
సాల్ట్
తాలింపుకి
1 tsp నూనె
1/2 tsp ఆవాలు
1/2 tsp మినపప్పు
1/2 tsp జీలకర్ర
2 ఎండు మిర్చి
కారం -సరిపడా
తయారీ విధానం :
ముందుగా లేత సొరకాయను తీసుకుని కడిగి తొక్కు తీసి వేసి చిన్న చిన్న ముక్కలాగా కోసుకుని ఉంచుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె పోసి ఎండు మిర్చి, జీలకర్ర,ఆవాలు, సాయి మినపప్పు, కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేగాక అందులో పచ్చిమిర్చి, ఉల్లి పాయ ముక్కలు వేసి వేపాలి. అవి వేగాక ముందుగా తొక్కు తీసుకుని ఉంచుకున్న లేత సొరకాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి. ముక్కలు కొంచెం ఉడికిన తరువాత అందులో ఉప్పు,కారం, పసుపు వేసి తిప్పాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి మూత పెట్టండి. ఒక 5 నిముషాలు అయ్యాక చిక్కటి కొబ్బరి పాలు పోయాలి.ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేం మీద ఉడికించుకోండి. కొబ్బరి పాలు ఇంకా కొద్దిగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయండి.ఈ సొర కాయ కూరను వేడి వేడి అన్నంలో గాని, చపాతీలో గాని తింటే భలే రుచికరంగా ఉంటుంది


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: