రుచికరమైన పాల పొడి లడ్డూ ఎలా చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay
లడ్డూలు ఎంత రుచికరంగా వుంటాయో అందరికి తెలిసిందే. అవి ఎంతో రుచికరమైన స్వీట్స్.ఒక్కసారి తింటే ఆ రుచిని మరచిపోలేము. ఇక లడ్డూలని ఎన్నో రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు.రవ్వ లడ్డూలు,బూందీ లడ్డూలు చాలా రకాలుగా లడ్డూలు చేసుకోవచ్చు. ఇక పాల పొడితో చేసే లడ్డూలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఎంతో రుచికరంగా ఉంటాయి. పాలలోని పోషకాలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. లడ్డూలోని తీపిదనం ఎంతో రుచిని ఇస్తుంది. ఇక పాల పొడి లడ్డూని ఎలా చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...


పాల పొడి లడ్డూకి కావాల్సిన పదార్ధాలు...
 మిల్క్‌ పౌడర్‌ - 1 కప్పు,

చిక్కటి పాలు - పావు కప్పు (కాచి చల్లార్చినవి),

 పంచదార - పావు కప్పు,

నెయ్యి - 4 టేబుల్‌ స్పూన్లు,

ఫుడ్‌ కలర్‌ - కొద్దిగా (అభిరుచిని బట్టి)


పాల పొడి లడ్డూ తయారు చేయు విధానం: ముందుగా ఒక పాన్‌ తీసుకుని అందులో పాలు, పంచదార, 2 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసుకుని.. పంచదార కరిగే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. పాన్‌ స్టవ్‌ మీద పెట్టి.. చిన్న మంట మీద ఉంచి.. కొద్దికొద్దిగా మిల్క్‌ పౌడర్‌ వేసుకుంటూ మొత్తం మిశ్రమాన్ని గరిటెతో తిప్పుతూ ఉండాలి. బాగా ముద్దలా అయిపోయిన తర్వాత రెండు భాగాలుగా చేసుకుని, ఒక భాగాన్ని తీసి పక్కన పెట్టుకుని..మరో భాగాన్ని పాన్‌లోనే ఉంచి మిగిలిన నెయ్యి వేసుకుని బాగా తిప్పాలి. తర్వాత ఫుడ్‌ కలర్‌ వేసుకుని బాగా కలిపి.. పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మొదటిగా తీసి పక్కన పెట్టుకున్న ముద్దను చిన్న చిన్న బాల్స్‌ చేసుకుని.. వాటిపైన ఫుడ్‌ కలర్‌ కలిపిన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని ఒక్కోబాల్‌ చుట్టూ పెట్టుకుని.. నిమ్మకాయ సైజ్‌లో లడ్డూలు చేసుకోవాలి.ఇక రెడీ అయిపోయినట్లే. ఇంకెందుకు ఆలస్యం మీరు ఇంట్లో ట్రై చెయ్యండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: