రుచికరమైన కందిపొడిని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. కంది పొడి ఆంధ్ర ప్రజల సాంప్రదాయ వంటకం. కొండిపొడి ని వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో అది మాటల్లో చెప్పలేము. మరి రుచికరమైన మన ఆంధ్ర వంటకం కందిపొడిని ఎలా చెయ్యాలో తెలుసుకుందామా...!
రుచికరమైన కందిపొడి తయారీకి కావాల్సిన పదార్ధాలు...కందిపప్పు - కప్పు, పుట్నాల పప్పు - కప్పు, మిరపకాయలు - 10 నుంచి 12, జీలకర్ర - 3 టీ స్పూన్లు, మెంతులు - అరస్పూను, వెల్లుల్లి - 10, ఉప్పు - సరిపడినంత, కరివేపాకు - సరిపడినంత, ఇంగువ - కొంచెం.
అదిరిపోయే కందిపొడి తయారు చేయు విధానం చూడండి...మొదటగా పొయ్యిమీద బాణలి పెట్టి మొదట కందిపప్పును, కాసేపటి తర్వాత పుట్నాల పప్పును వేసి చక్కగా వేయించి పక్కన పెట్టుకోవాలి.బాణలిలో స్పూన్ నూనె వేసి..అందులో జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు.. చివరగా వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. సన్నని మంట మీద మాత్రమే వేయించుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
బాగా వేగాక ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి..సరిపడా ఉప్పు, కొంచెం ఇంగువ వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ చేసుకోవాలి.తర్వాత ఈ మిశ్రమానికి వేయించుకుని పెట్టుకున్న కందిపప్పు, పుట్నాల పప్పు జతచేసి పొడిగా అయ్యేవరకు మిక్సీ చేసుకోవాలి.
కందిపప్పుతోపాటు, కందులు కూడా కలిపి వాడితే మరింత రుచిని ఆస్వాదిస్తారు.ఈ పొడిని ఇడ్లీతోపాటు ఇతర టిఫిన్లతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వంటకాల ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: