రొయ్యల బిర్యాని చాలా సింపుల్ గా...!

Sahithya
బిర్యానిలో చాలా రకాలు ఉంటాయి గాని వాటిని చేసుకోలేరు చాలా మంది. చాలా మందికి కొన్ని బిర్యానిలు తినాలని ఉన్నా సరే చేసుకోవడం రాదు. అలాంటి వాటిలో రొయ్యల బిర్యాని కూడా ఒకటి.
కాబట్టి మీకు రొయ్యల బిర్యాని ఎలాగో చెప్తాను. బాస్మతి బియ్యం- ఒక కేజీ, రొయ్యలు- కేజీన్నర, పెరుగు- 200 గ్రాములు, నిమ్మరసం- మూడు, టీస్పూన్లు, కారంపొడి- 20 గ్రాములు చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 100 గ్రాములు, ఉప్పు- 50 గ్రాములు, గరం మసాలా- 20 గ్రాములు కావాలి. రిఫైన్డ్‌ ఆయిల్‌- 100 గ్రాములు వేయండి. వేగించిన ఉల్లి ముక్కలు - 30 గ్రాములు, జీడిపప్పు – కొద్దిగా వేయండి.  కొత్తిమీర తరుగు - 15 గ్రాములు వేయండి. పుదీనా తరుగు - 15 గ్రాములు, బిర్యాని ఆకులు- ఐదు గ్రాములు, డాల్డా లేదా నెయ్యి- 150 గ్రాములు, నీళ్లు- 5 లీటర్లు పోయండి.
ఒక గిన్నెలో రొయ్యలు వేసి వాటిలో నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, గరంమసాలా, వేగించిన ఉల్లి ముక్కలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు, ధనియాల పొడి అలాగే నూనె వేసి కలపండి. దీన్ని రెండు నుంచి మూడు గంటలు నానబెట్టి.... ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో గరం మసాలా వేయాలి. బిర్యాని ఆకులు కూడా వేయాలి. నీళ్లు ఉడుకుపట్టాక కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అందులో వేయాలి.

బియ్యం సగం ఉడికాక నీళ్లు వంచండి. అన్ని వైపులా సమంగా ఉన్న గిన్నె తీసుకుని అందులో ముందు నానబెట్టిన రొయ్యల్ని ఒక పొరలా వేసుకోండి. వాటిపైన సగం ఉడికించిన బిర్యాని రైస్‌ను పొరలా పరవండి. పైన కొంచెం నెయ్యి వేయాలి. ఈ గిన్నెను ఒక తవాపై ఉంచి సన్నటి మంట మీద 25 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా గిన్నెను, మూతను కలిపి మైదాతో మూసి... మండుతున్న బొగ్గులు మూతమీద వేసి 20 నిమిషాల తర్వాత మూతను తీసి కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించండి. ఈ రొయ్యల బిర్యాని ఏమీ కలుపుకోకుండా అలానే తిన్నా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: