అబ్బా.. గోంగూరతో రొయ్యల కూర అదుర్స్!

Durga Writes

గోంగూర‌తో రొయ్య‌ల కూర‌ ఎంత బాగుంటుందో తెలుసా? ఇన్నాళ్లు మనం గోంగూర చికెన్.. గోంగూర మటన్... గోంగూర చట్నీ ఇలా అన్ని రకాలు మనం గోంగూరతో చేసుకొని తిని ఉంటాం.. కానీ గోంగూర రొయ్యల కూర చేసుకొని తిని ఉండం.. అలాంటి రొయ్యల కూరను గోంగూరతో కలిపి తింటే సూపర్ ఉంటుంది.. అలాంటి గోంగూర రొయ్యల కర్రీ ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

రొయ్యలు - పావుకిలో, 

 

గోంగూర - 4 కట్టలు, 

 

పచ్చిమిర్చి - 15, 

 

ఉల్లిపాయలు - 2, 

 

ఎండుకొబ్బరి పొడి - టీస్పూను, 

 

అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, 

 

గరం మసాలా - టీస్పూను, 

 

కారం - టీస్పూను, 

 

పసుపు - అరటీస్పూను, 

 

కొత్తిమీర తురుము - టేబుల్‌స్పూను, 

 

ఉప్పు - తగినంత, 

 

నూనె - 4 టేబుల్‌స్పూన్లు,

 

తయారీ విధానం... 

 

పాన్ లో గోంగూర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేయించాలి. తర్వాత మిక్సీలో వేసి ముద్దలా చేసి మరో పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక ఉల్లి ముక్కలు వేసి వేగాక రొయ్యలు వేసి ఒక నిమిషం ఉడికించాలి. అలా ఉడికించిన సమయంలో రొయ్యల్లోంచే నీరు వస్తుంది. అప్పు ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపాలి. నీరు సరిపోదు అనుకుంటే కొద్దిగా పోసి ఉడికించాలి. రొయ్యలు ఉడికిన తరవాత ఎండుకొబ్బరి, గరంమసాలా, కొత్తిమీర తురుము, గోంగూర ముద్ద వేసి బాగా కలిపి నూనె వచ్చే వరుకు ఉడికించి దించాలి. అంతే గోంగూర రొయ్యల కర్రీ రెడీ.. ఇంకేందుకు ఆలస్యం ఇంట్లో వారికీ రొయ్యలు కర్రీ చేసి పెట్టండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: