రుచిక‌ర‌మైన ' ట‌మాటా పులిహోర '

Kavya Nekkanti
కావాల్సిన ప‌దార్ధాలు:
బియ్యం: పావుకిలో
ట‌మాటాలు: పావుకిలో
చింతపండుగుజ్జు: టేబుల్‌స్పూను
పచ్చిమిర్చి: 6
ఉప్పు: తగినంత


ఎండుమిర్చి: 4
ఆవాలు: టీస్పూను
నూనె: 100 మి.లీ
కరివేపాకు: 4 రెబ్బలు
పసుపు: టీస్పూను


ఇంగువ: చిటికెడు
వేరుసెనగ పప్పు: 3 
టేబుల్‌స్పూన్లు
సెనగపప్పు: 2 టేబుల్‌ స్పూన్లు
మినప్పప్పు: 2 టేబుల్‌స్పూన్లు 


తయారీ విధానం: 
ముందుగా ట‌మాటాలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసి ఉడికించాలి. చల్లారాక చింతపండు గుజ్జు చేర్చి మెత్తగా రుబ్బాలి. అన్నం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. వెడల్పాటి బాణలిలో ఉడికించిన అన్నంలో ట‌మాటా గుజ్జు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.


ఆ త‌ర్వాత బాణలిలో నూనె పోసి వేరుసెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పసుపు వేసి వేయించాలి. తరవాత కరివేపాకు కూడా వేసి వేగాక ఈ తాలింపును ట‌మాటా గుజ్జు కలిపిన అన్నంలో వేసి కలపాలి. అంతే ఎంతో రుచిక‌ర‌మైన ట‌మాటా పులిహోర రెడీ.. ట‌మాటాతో పులిహోర ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని అల్పాహారంగా తీసుకోవ‌చ్చు, లేదా మధ్యాహ్న భోజ‌నం రూపంలోనూ తీసుకోవ‌చ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: