యూట్యూబ్లో చూసి అది ట్రై చేశాడు.. ఇప్పుడు 20 ఏళ్లకే రూ.కోటి బిజినెస్?
కరోనా విజృంభిస్తూ లాక్ డౌన్ ఏర్పడిన సమయంలో ఇక అందరి జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. ఉద్యోగాలు కోల్పోయి ఇక వ్యాపారం నడవక ఎంతోమంది ఆర్థిక నష్ట కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం లాక్ డౌన్ ని తన కెరియర్ కోసం వాడుకున్నాడు. చివరికి సక్సెస్ అయ్యాడు. ఉదయ్ పూర్ కు చెందిన దిగ్విజయ్ సింగ్ చాక్లెట్ తయారు చేయడం ప్రారంభించాడు. చాక్లెట్ తయారు చేయడం ఎలా అని యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాడు. సారం అనే బ్రాండ్ తో ఇప్పుడు చాక్లెట్లను విక్రయిస్తున్నాడు. అతనికి కేవలం 20 సంవత్సరాలు మాత్రమే కానీ అతను బిజినెస్ కోటి రూపాయల వరకు ఉంటుంది.
కరోనా సమయంలోనే అతనికి ఈ ఆలోచన పుట్టింది. లాక్ డౌన్ లో దొరికిన ఖాళీ సమయాన్ని ఆసక్తికరంగా మార్చుకోవడానికి కొత్తగా ఏదైనా ట్రై చేయాలని అనుకున్నాడు. ఇంట్లో చాక్లెట్ తయారు చేయాలని ఆలోచన వచ్చింది. పదహారేళ్ళ వయసులోనే చిన్న అడుగు వేసిన అతడు సొంతంగా కంపెనీ ప్రారంభించేలా చేసింది. ఇప్పుడు సారం పేరుతో కొత్త కంపెనీని నడుపుతున్నాడు. ఇప్పటివరకు రెండు టన్నులకు పైగా చాక్లెట్లను విక్రయించాడు. దేశవ్యాప్తంగా కూడా ఇతని చాక్లెట్లు విక్రయాలు జరుగుతున్నాయి. ఇక అతను చాక్లెట్ తయారు చేయడానికి యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ పొంది నేర్చుకున్నాడు. అయితే 2021 లో దిగ్విజయ్ కి కార్ షోరూమ్ నుంచి వెయ్యి చాక్లెట్లు మొదటి ఆర్డర్ అందుకున్నారు. అదే సంవత్సరంలో తన బ్రాండ్ సారం ను ప్రారంభించాడు. ఇలా కాలక్షేపానికి అతను చేసిన పని ఇక ఇప్పుడు అతన్ని సంపన్నుడిని చేసింది. ఇలా పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు దిగ్విజయ్ సింగ్.