ఇండియాలో హైయ్యెస్ట్ ప్రాఫిట్స్ సంపాదించే కంపెనీలు.. వీటి సింగిల్ డే ప్రాఫిట్ ఎంతంటే..?
ప్రముఖ ఫైనాన్షియల్ న్యూస్ ఔట్‌లెట్ "ఈటీ మనీ" భారతదేశంలో ప్రతి రోజు ఎక్కువగా సంపాదించే కంపెనీల లిస్టును విడుదల చేసింది. ఆ లిస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ మొదటి స్థానంలో ఉంది. అంటే, రిలయన్స్ కంపెనీనే ప్రతి రోజు ఎక్కువ డబ్బు సంపాదిస్తోంది. 2024 సంవత్సరంలో, రిలయన్స్ కంపెనీ ప్రతి రోజు సుమారు 216.50 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. ఈ డబ్బులో ఎక్కువ భాగం ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ రిలయన్స్ జియో ద్వారా వస్తోంది.
రెండవ స్థానంలో ఉన్నది ఎస్‌బీఐ బ్యాంకు. ఈ బ్యాంకుకి దేశంలో కోట్ల కొద్దీ కస్టమర్లు ఉన్నారు. ఈటీ మనీ రిపోర్టు ప్రకారం, ఎస్‌బీఐ ప్రతి రోజు సుమారు 186.70 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. ఇక ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ ప్రధానంగా ఇళ్ల కొనుగోలుకు అప్పులు ఇస్తుంది. దేశంలో కోట్ల కొద్దీ మంది ఈ బ్యాంకు కస్టమర్లు ఉన్నారు. ఈ బ్యాంకు ప్రతి రోజు సుమారు 179.30 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.
ప్రభుత్వ కంపెనీ ఓఎన్‌జీసీ భారతదేశంలో చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే అతిపెద్ద కంపెనీ ఇదే. ఈ కంపెనీ ప్రతి రోజు సుమారు 156.40 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. బడా సాఫ్ట్‌వేర్ కంపెనీ టీసీఎస్ ప్రతి రోజు సుమారు 126.30 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. ప్రైవేట్ బ్యాంకు అయిన ఐసీఐసీఐ రోజూ సుమారు 123.30 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.
ప్రభుత్వ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతి రోజు సుమారు 118.20 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. ప్రభుత్వ బీమా కంపెనీ ఎల్‌ఐసీ ప్రతి రోజు సుమారు 112.10 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.