ఇట్టాగైతే ఎట్టా.. యూపీఐ పేమెంట్స్ చేయాలా వద్దా?

praveen

మన దేశంలో చాలామంది ఇప్పుడు ఫోన్‌పే, గూగుల్‌పే లాంటి యాప్‌ల ద్వారా డబ్బులు పంపించుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది, ఇంటర్నెట్ కూడా ఎక్కడైనా దొరుకుతుంది. చిన్న చిన్న చాయ్ వాలాల నుండి పెద్ద పెద్ద మాల్స్ వరకు అందరూ UPI పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా ఫోన్ లో ఉన్న యూపీఐ యాప్ ద్వారా స్కాన్ చేసి ఎక్కడంటే అక్కడ, ఏదంటే ఆ వస్తువు కొనుగోలు చేసే వెసులుబాటు లభించింది. గతంలో డబ్బులు పంపించాలంటే బ్యాంకు లైన్లలో ఎక్కువ సేపు నిలబడాల్సి వచ్చేది కదా! ఇప్పుడు అలాంటి అవసరం లేదు.
ఇప్పుడు డబ్బులు పంపించడం చాలా సులభమైపోయింది. ఒక క్లిక్ చేస్తే చాలు. ఫోన్‌పే, గూగుల్‌పే లాంటి యాప్‌ల ద్వారా డబ్బులు పంపించడానికి ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ, మొబైల్ రీఛార్జ్ చేయడం లేదా బిల్లులు చెల్లించడం కోసం చిన్న మొత్తంలో ఛార్జీలు ఉంటాయి. ఇప్పుడు ఈ యాప్‌ల ద్వారా మామూలుగా ట్రాన్సాక్షన్లు అంటే డబ్బులు పంపించడానికి కూడా ఛార్జీలు వేయాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. కానీ చాలామంది ఈ ఛార్జీలు వస్తే ఈ యాప్‌లు వాడడం మానేస్తామని చెబుతున్నారు. అంటే ఫ్రెండ్ కి డబ్బు పంపిస్తే ఎంతో మనీ ఛార్జ్ రూపంలో కట్ అవుతుంది. అయితే దీని ప్రజలు ఒప్పుకుంటారా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక సర్వే చేశారు.
ఆ సర్వే ప్రకారం, 75 శాతం మంది ఫోన్‌పే, గూగుల్‌పే లాంటి యాప్‌ల ద్వారా డబ్బులు పంపించడానికి ఛార్జీలు వేస్తే వాడడం మానేస్తామని చెప్పారు. కేవలం 22 శాతం మంది మాత్రమే ఛార్జీలు వేసినా కూడా ఈ యాప్‌లు వాడతామని అన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 38 శాతం మంది తమ చెల్లింపులలో సగం భాగాన్ని ఈ యాప్‌ల ద్వారా చేస్తామని చెప్పారు.
ఈ సర్వే ఫలితాలను కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకు, రిజర్వ్ బ్యాంకుకు తెలియజేయాలని నిర్ణయించారు. 2023-24 సంవత్సరంలో ఈ యాప్‌ల ద్వారా జరిగే లావాదేవీలు 57 శాతం పెరుగుతాయని అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

upi

సంబంధిత వార్తలు: