హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవలసిందే?

Suma Kallamadi
యావత్ దేశంలోనే ప్రైవేట్ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకు ఏదంటే మొదటగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేరు మాత్రమే వినబడుతుంది. ఈ క్రమంలోనే దాదాపుగా చాలామంది ఎంప్లాయీస్ కి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్స్ లలో ఖాతాలు ఉంటాయి. ఇక ఖాతాలు ఉన్నవారు కూడా సుమారుగా క్రెడిట్ కార్డులు కూడా వాడుతూ ఉంటారు. మీకు కూడా అలా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడుతున్నట్టయితే ఈ వార్త మీ కోసమే. తాజాగా క్రెడిట్ కార్డు హోల్డర్లకు హెచ్‌డీఎఫ్‌సీ కీలక ప్రకటన జారీ చేసింది. కొత్త నియమనిబంధనల్ని అమల్లోకి తెస్తూ... 2024, ఆగస్టు 1 వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని సుస్పష్టం చేసింది.
థర్ట్ పార్టీ పేమెంట్ యాప్స్‌ను ఉపయోగించి చేసే రెంటల్ ట్రాన్సాక్షన్స్‌పై హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా ఛార్జీలను ప్రకటించింది. అంటే.. మీరు ఇకనుండి ఇతర యాప్స్ సాయంతో రెంట్ పేమెంట్స్ చేస్తే.. ఛార్జీలు వర్తిస్తాయి. క్రెడ్, పేటీఎం, మొబిక్విక్, చెక్ ఇలా ఇతర థర్డ్ పార్టీ పేమెంట్ అప్లికేషన్స్ ఉపయోగించి.. రెంటల్ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే ట్రాన్సాక్షన్ నగదు మొత్తంలో ఇకపై ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా యుటిలిటీ ట్రాన్సాక్షన్లపై కూడా కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. రూ. 50 వేల లోపు చేసే లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుములు పడవు గానీ రూ. 50 వేల పైన ఉంటేనే.. ఒక శాతం ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది. ఇది ఒక ట్రాన్సాక్షన్‌పై గరిష్టంగా రూ. 3 వేల వరకు ఉంటుందని సమాచారం.
అదేవిధంగా ఫ్యూయెల్ ట్రాన్సాక్షన్లపై కూడా ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. ట్రాన్సాక్షన్ విలువ రూ. 15 వేలు దాటినట్లయితే మొత్తం ట్రాన్సాక్షన్ నగదుపై 1% చెల్లించాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించి చేసే ఎడ్యుకేషనల్ ట్రాన్సాక్షన్లపై కూడా 1% ఫీజు ఉంటుంది. అయితే దీంట్లో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ పేమెంట్లకు మాత్రం మినహాయింపు కల్పించడం కొసమెరుపు. నేరుగా కాలేజీ లేదా స్కూల్ వెబ్‌సైట్స్, లేదా సంబంధిత POS మెషీన్ల ద్వారా చేసే ట్రాన్సాక్షన్లకి మినహాయింపు ఎలాగూ ఉంటుంది. ఇంటర్నేషనల్ లేదా క్రాస్ కరెన్సీ ట్రాన్సాక్షన్లపై 3.5%, అవుట్‌స్టాండింగ్ అమౌంట్ ప్రాతిపదికన లేట్ పేమెంట్ ఫీజు స్ట్రక్చర్ రూ. 100 నుంచి రూ. 300 వరకు ఉన్నట్టు తెలుస్తోంది.
గమనిక: పూర్తి సమాచారం కొరకు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: