10th , ఇంటర్ అర్హత కలిగి ఉన్నారా? అయితే Jioలో ఉద్యోగాలు మీవే!

Suma Kallamadi
అవును.... 10th , ఇంటర్ ఆపై చదువులు చదివి ఉద్యోగం లేదని బాధపడుతున్నారా? మీలాంటివారికే ఈ సదవకాశం. రిలయన్స్ జియో లో వివిధ విభాగాలలో దాదాపుగా 30 వేల వరకు ఖాళీ పోస్టులకు గాను దరఖాస్తులను కోరుతోంది. దానికి 10th, ఇంటర్మీడియట్ వంటి అర్హతలతో పాటు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి అర్హతలు కలిగిన వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. అదేవిధంగా పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకునే వారు కూడా దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కలదు. అప్లై చేయాలనుకున్నవారు జియోకి చెందిన అధికారిక వెబ్సైట్ లో మీ వివరాలన్నీ నమోదు చేస్తే కంపెనీవారు అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి కాల్ / మెయిల్ ద్వారా సంప్రదించి ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
అంతేకాకుండా ఇక్కడ తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ నోటిఫికేషన్ ద్వారా ఫుల్ టైం మరియు పార్ట్ టైం ఉద్యోగాలు భర్తీ చేయడం... ఇందులో మీరు ఫ్రీ లాన్సర్ గా కూడా పని చేసే అవకాశం పొందవచ్చు.
 
విభాగాలు: సేల్స్ మరియు డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ ఆపరేషన్స్ , ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ, అప్రెంటిస్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, హోమం రిసోర్సెస్ మరియు ట్రైనింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కార్పొరేట్ ఎఫైర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ , రెగ్యులేటరీ, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కాంట్రాక్ట్స్, ఆపరేషన్స్ , సప్లై చైన్ కార్పొరేట్ సర్వీసెస్, లీగల్ మార్కెటింగ్ మరియు ఇతర విభాగాల్లో ఈ పోస్టుల భర్తీ చేయనుంది రిలియన్స్ కంపెనీ.
గమనిక: ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు.
అర్హతలు: 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ డిప్లమా, బిటెక్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్
పోస్టింగ్ లొకేషన్: మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం పొందే అవకాశం ఉంది.
కనీస వయస్సు: కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
చివరి తేదీ: ఇంకా పేర్కొనలేదు కాబట్టి సత్వరమే దరఖాస్తు చేసుకుంటే ఉత్తమం.
ఎంపిక విధానం: అప్లై చేసిన ఉద్యోగాన్ని బట్టి పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి..
లింక్: https://careers.jio.com/frmJobCategories.aspx

మరింత సమాచారం తెలుసుకోండి:

jio

సంబంధిత వార్తలు: