షేర్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. ఈ స్టోరీ చదవాల్సిందే?

Chakravarthi Kalyan
స్టాక్ మార్కెట్ పేరుతో మోసపోయిన విద్యార్థిని డబ్బులను... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెనక్కి ఇప్పించారు. బాధిత విద్యార్థిని కేసు పెట్టడంతో తనకు రావాల్సిన రూ. 10 లక్షలను సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు అందజేశారు. ఇంతకీ ఏమైందంటే..  హైదరాబాద్ నగరానికి చెందిన 21 ఏళ్ల యువతి విద్యను అభ్యసిస్తుంది. కరోన సెకండ్ వేవ్ లో బాధిత యువతి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పై అవగాహన తెచ్చుకుంది. ఫేస్ బుక్ లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట వచ్చిన ఓ పోస్టును చూసింది. "యూనిటీ స్టాక్స్" కంపెనీ పేరిట 100 శాతం లాభాలు వస్తాయని ఆ పోస్టులో ఉంది.

ఆ కంపెనీ లో ఇన్వెస్ట్ చేయాలని, ఫేస్ బుక్ లో వారిని ఫాలో అయింది. ఆ కంపెనీ నుండి వాట్సాప్ ద్వారా కంపెనీ కు సంబందించిన సమాచారం, అధిక లాభాలు పొందిన క్లయింట్స్ ప్రూఫ్స్ ను పంపించారు. బాధిత యువతికి నమ్మకం కలగడంతో యువతి ఆధార్, పాన్ డిటైల్స్ తీసుకొని ఒక అకౌంట్ ను క్రియేట్ చేశారు. సదరు యువతి వారు తెలిపిన అకౌంట్ లలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రారంభించింది. ఆమె చేసిన ఇన్వెస్ట్మెంట్ కు లాభాలు వచ్చినట్లు చూపుతూ  మరింత నమ్మకం కలిగించారు. ఆరు నెలల తరువాత తాను ఇన్వెస్ట్ చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరింది.

అయితే స్కామర్లు ఆమె డబ్బు సురక్షితంగా ఉందని... స్టాక్ మార్కెట్ లో కంపెనీ ఇన్వెస్ట్మెంట్లు క్షీణించాయని, రిటర్న్ చేయడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. అలాగే ఇన్వెస్ట్ చేయడం నిలిపివేస్తే, ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు రిఫండ్ అవ్వవని బెదిరించారు. దీనితో మోసపోయానని గ్రహించిన బాధిత యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి స్కామర్ల నుండి యువతికి రావాల్సిన డబ్బును రికవరీ చేసి ఆమెకు అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: