రియల్ ఎస్టేట్ దూసుపోతోందా?
గతంలో ఇళ్లు కొనడం అనేది లగ్జరీ లైఫ్ గా భావించే వారు. అయితే ప్రస్తుతం ఇళ్లు అనేది ఫెసిలిటీగా భావిస్తున్నారు. కారు, బైక్ అనేది లగ్జరీగా భావించే స్థాయి నుంచి అవసరం అనే విధానంలోకి మారడంతో ప్రజల్లో మార్పు వస్తుంది. దానికనుగుణంగా లైఫ్ ను కొనసాగిస్తున్నారు.
దీని కోసం కష్టపడుతూ పైకి ఎదుగుతున్నారు. జులై, సెప్టెంబర్ త్రైమాసికాల్లో కార్లు, ఎస్వీయూలు, వ్యాన్లు అత్యధికంగా అమ్ముడుపోయినట్లు వాహనతయారీదారుల సమాఖ్య తెలిపింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వాహనతయారీ దారుల సంస్థలకు 10 లక్షల 74 వేల 189ప్రయాణికుల వాహనాలు కొన్నారని తెలపింది. 22-23 సంవత్సరంతో పోల్చితే ఈ సంఖ్య 4.7 శాతం అధికంగా ఉందని తెలిపింది. దేశ వ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో ప్లాట్ల కొనుగోలు కూడా చాలా వరకు పెరిగిందని స్థిరాస్తి వ్యాపార సంస్థ జెఎల్ పేర్కొంది.
సంవత్సరంలో లక్ష 96 వేల 226 వేల యూనిట్ల వరకు అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి గతేడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కాకముందే ఎక్కవగా అమ్ముడుపోవడం ఆశించదగిన విషయమన పేర్కొన్నారు. పండగల సమయం కావడంతో మరింత ఎక్కువగా మార్కెట్ నడిచే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా స్థిరాస్తి రంగం మెరుగ్గా కొనసాగుతుంది. ఇలాగే కొనసాగితే పోయిన ఏడాది కంటే ఇప్పుడే ఎక్కువగా ప్లాట్ల కొనుగోలు ఎక్కువగా నమోదు కానుంది.